విజయవాడలో విజయోత్సవ ర్యాలీని తలపించిన కేశినేని నాని నామినేషన్ ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని నాని ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఢిల్లీ రావు కి నామినేషన్ పత్రాలు సమర్పించారు అశేష జనవాహిని నడుమ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల కోలాహలంతో ఆద్యంతం యువత, మహిళల కేరింతల మధ్య వినాయకుడి గుడి నుండి కే.ఆర్. మార్కెట్, లో బ్రిడ్జి, కేశినేని భవన్, ఏలూరు రోడ్డు, బీసెంట్ రోడ్డు, మ్యూజియం రోడ్డు మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. వినాయకుడి గుడి వద్ద పురోహితులు ఆశీర్వచనాలు అందించగా,ఇందాద్ ఘర్ వద్ద ముస్లిం సోదరులు, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద క్రిస్టియన్, సిక్కు సోదరులు ప్రార్థనలు చేసి కేశినేని నానికి దీవెనలు అందించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబంలో జరిగే శుభకార్యంలాగా నామినేషన్ ర్యాలీని విజయవాడ పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు వెలంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, మొండితోక జగన్మోహన్ రావు, దేవినేని అవినాష్,సర్నాల తిరుపతి రావు, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు,మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, ఎమ్మెల్సీ రూహుల్లా గార్లు, పోతిన మహేష్, ఆకుల శ్రీనివాస్ మరియు వైయస్సార్సీపీ ముఖ్య ప్రజాప్రతినిధులు దగ్గరుండి ర్యాలీని విజయవంతం చేశారు. ఎంపీ కేశినేని నాని కుమార్తెలు కేశినేని శ్వేత, హైమలు, అల్లుళ్ళు రఘు, ప్రీథ్వీలు, బంధుమిత్రులు వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అందరిని ఉత్సహపరుస్తూ ర్యాలీని ముందుకు నడిపారు. మండుటెండలో సైతం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, వివిధ అసోసియేషన్ సభ్యులు, ఆటో, టాక్సీ డ్రైవర్లు, హమాలీలు అడుగడుగునా గజమాలలు, హారతులతో ఎంపీ కేశినేని నాని గారికి బ్రహ్మ రథం పట్టారు. బంజారా నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలువగా, పకీరుల డప్పులు,తీన్మార్, డప్పులు, డీజేలతో ర్యాలీ కోలహాలంగా మారింది. జగనన్న పాటలతో, జై జగన్, జై నాని నినాదాలతో ఉత్సాహంగా జరిగిన ర్యాలీకి నియోజకవర్గ నలుమూలల నుండి వైయస్సార్సీపీ కుటుంబ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థులు సామినేని ఉదయభాను, నల్లగట్ల స్వామిదాస్, సర్నాల తిరుపతిరావు, గోపాలకృష్ణ మరియు కుటుంబసభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలు కలెక్టర్ ఢిల్లీరావు కి అందించారు.

ఈ సందర్బంగా ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు కంటే 3 రెట్లు జగన్ అభివృద్ధి చేశారు. జగన్ హయాంలో రాష్ట్ర ప్రజల స్థూల ఆదాయం పెరిగింది. బెజవాడ పార్లమెంట్ లో 7 సీట్లు, ఎంపీ సీటు వైసీపీ గెలుస్తుంది. బెజవాడ అభివృద్ధికి చంద్రబాబు 100 కోట్లు కూడా ఇవ్వలేదు. అమరావతిని రియల్ ఎస్టేట్ గా మార్చి అమ్ముకోవటం కోసం విజయవాడ, గుంటూరులను చంద్రబాబు నాశనం చేశారు. 2 జిల్లాల్లో గ్రీన్ బెల్ట్ పెట్టి ప్రజలను చంద్రబాబు మోసం చేశాడు. అమరావతి రియల్ ఎస్టేట్ సంస్థ – అమరావతి అనేది ఒక పెద్ద స్కాం. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చంద్రబాబు ద్రోహి. జగన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంస్కరణలు చేస్తున్నారు. రాష్ట్రంలో పేదల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. 18 వేల కోట్లు హెల్త్ మీద జగన్ ఖర్చుపెట్టారు. ఎన్నికల తర్వాత టీడీపీకి తాళం వేస్తారు – ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీ టేక్ ఓవర్ చేసుకుంటుంది. చంద్రబాబు ఎన్ని వందల హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. టీడీపీ ఎంపీ అభ్యర్ధి కార్పొరేటర్ కి ఎక్కువ – 14 వేల ఓట్లు కూడా రావు! అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ లు, డైరెక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్, సర్పంచ్ లు,ఎంపీటీసీలు, వార్డ్ మెంబెర్స్,వివిధ హోదాల్లో వైయస్సార్సీపీ కోసం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *