Breaking News

వైకాపా అరాచక పాలనను అంతమొందించండి…

-ఏపీ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి సైకిల్ గుర్తుకు ఓటేయండి.
-మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్.

జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను అంతమొందించడానికి అందరూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ ఏపీలో పేదల సంక్షేమం, అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో విషయాల్లో మాట తప్పి మడమ తిప్పారని దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. వైసీపీ పాలనలో ఎన్నో విషయాల్లో విధానపరమైన లోపాల వల్ల యువత భవిష్యత్తు నిర్వీర్యమైందన్నారు. సంక్షేమంతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీయే కూటమితోనే సాధ్యమన్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని, దీనివల్ల ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరవైందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసంఘటితరంగ కార్మికుల పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో నేను ఇల్లు, ఆఫీస్ ఎక్కడ కట్టుకున్నానని చెప్పి, దీనిపై అసెంబ్లీలో కూడా ప్రస్తావించి సీఎం మాట తప్పారన్నారు. రాజధానిని ఎందుకు మూడు ముక్కలు చేస్తున్నారనటానికి సరైన కారణం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎవరు ముందుకు రావడం లేదన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ చార్జీలు విపరీతంగా ఉండటంతో ఒకవేళ పరిశ్రమలు పెట్టినప్పటికీ నష్టాలతో మూతపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఏపీకి పెట్టుబడులు లేవన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువత యువత పెరిగిందన్నారు.

ఏపీలో ఉన్నత చదువులు చదివిన ఎందరో యువకులు కూలి పనులకు వెళ్తున్నారని కొంతమందికి ఆపనులు కూడా లభించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ అందరి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారన్నారు.

మద్యం, ఇసుక, ఇతర నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినట్లు పేర్కొన్నారు. ఇసుకను కిలోల లెక్కన అమ్ముతున్నారన్నారు. ఇసుక లభించకుండా కృత్రిమ కొరత సృష్టించి, తర్వాత ఇసుక ధరలను విపరీతంగా పెంచారన్నారు. దీనివల్ల నిర్మాణరంగం కుదేలై తాపీ కార్మికులు, దీనిపైనే ఆధారపడి జీవించే ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి లేదన్నారు.

వైకాపా ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఈ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గం అభివృద్ధికి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వలేదన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ యుద్ధంలో సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *