జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం నేటితో పూర్తి

-ప్రశాంతంగా సజావుగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగులు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు సజావుగా తమ పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారని నేటి గురువారంతో జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం పూర్తి అయిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024 – సాధారణ ఎన్నికలలో భాగంగా ఎలక్షన్ విధులు కేటాయించబడిన ఉద్యోగులకు ఈ నెల 5 నుండి నేటి వరకు సంబందిత నియోజకవర్గాల ఫెసిలిటేషన్ సెంటర్ల నందు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందని సదరు ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా నేటి వరకు వినియోగించుకున్నారని, అన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల నందు ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు కల్పించడం జరిగిందని, నేటితో జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *