Breaking News

వైఎస్సార్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే – భూమన

-సామాన్యుడినైన నాకు ఎంపీ పదవి జగన్ పుణ్యమే – ఎంపీ గురుమూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత వైఎస్సార్ 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు వైసిపి ముఖ్య నాయకులు ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్ తో తన ఆత్మీయ సంబంధాలని తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నెమరువేసుకొన్నారు. వైఎస్సార్ ఆత్మగా పేరుగాంచిన కెవిపి తరువాత ఆ మహనీయుడుతో తనకు సాన్నిహిత్యం ఉందన్నారు. ఇవాళ తాను ఈ స్థితిలో ఉన్నానంటే అది వైఎస్సార్ పుణ్యమే అన్నారు. వైఎస్సార్ కి ముందు ఆయన తండ్రి రాజా రెడ్డితో తనకు ఆత్మీయ అనుబంధం ఉండేది అన్నారు. రాజారెడ్డి ద్వారా వైఎస్ తో తనకు ఏర్పడిన పరిచయం ఆయన తుది శ్వాస వరకు కొనసాగిందన్నారు. అతి సామాన్య వ్యక్తి అయిన తాను వైఎస్సార్ లాంటి గొప్ప వ్యక్తి ప్రేమను చూరగొనడం గర్వంగా ఉందన్నారు. వైఎస్సార్ తో వేలకొద్దీ తియ్యటి జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. వైఎస్సార్ ఔన్నత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు.

అనంతరం తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా వైఎస్సార్ ను నాలుగు సార్లు కలిసినట్టు చెప్పారు. వైఎస్సార్ ఫీజు రీయంబర్సమెంట్ తోనే తాను చదుకున్న విషయాన్నీ గుర్తు చేసారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద తన తండ్రికి ఆపరేషన్ తోపాటు రైతు రుణమాఫీ కూడా జరిగిందని కొనియాడారు. వైఎస్సార్ భౌతికంగా లేకపోయినా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరంజీవిగా నిలిపాయన్నారు. వైఎస్సార్ బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారన్నారు. అతి సామాన్యుడు అయిన తనను దేశంలోనె ప్రతిష్టాత్మకమైన తిరుపతి ఎంపీ గా చేయడం వైఎస్ జగన్ గొప్పతనానికి నిదర్శనం అన్నారు.

మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ వైఎస్సార్ ను నేరుగా ఎప్పుడూ చూడలేదన్నారు. కానీ వైఎస్సార్ గొప్పతనం గురించి కథలు కథలుగా చెప్పడం విన్నాను అన్నారు. వైఎస్సార్ ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడన్నారు.

ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఒక డాక్టరుగా వైఎస్సార్ తో తనకు అనుబంధం ఉందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చొరవతో తన ఆసుపత్రిని వైఎస్సార్ ప్రారంభించడం మరువలేని జ్ఞాపకం అన్నారు. వైద్య రంగంలో వైఎస్సార్ తీసుకొచ్చిన సంస్కరణలు నేడు అనేక రాష్ట్రాలలో అమలవుతున్నాయి అన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఎంతోమంది పేదల ప్రాణాలు నిలిపిందన్నారు.

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎన్నో అద్భుతాలు సృష్టించారన్నారు. సాగునీటి రంగానికి ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. శ్రీ సిటీ, కొప్పర్తి లాంటి పారిశ్రామిక సెజ్ లు వైఎస్సార్ పుణ్యమే అన్నారు. ఆయన మరణం నేటి సమాజానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ఆరణి సంధ్య, రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదం రాధాకృష్ణా రెడ్డి పార్టీ నాయకులు ఆరె అజయ్, ఎం. రవిచంద్రా రెడ్డి సీనియర్ జర్నలిస్ట్లు రవి కుమార్, నగేష్, ఆదిమూలం శేఖర్, కుమార మంగళం నేతాజీ తదితరులు పాల్గొనున్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *