Breaking News

ఆర్టీసీ పండిట్ నెహ్రూబస్ స్టేషన్ లో వరద బాధితులకు ఆహార ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకుచెరువులు, వాగులు, వంకలు పొంగి పల్లపు ప్రాతాలు, రోడ్లు, హైవేలు సైతం నీట మునిగిన విషయం అందరికీ తెలిసినదే. విజయవాడలోని లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించిన కారణంగా నిరాశ్రయులైన వారు మరియు ప్రయాణ మార్గాలలో అంతరాయం కారణంగా బస్సులు లేనందున ఇబ్బంది పడ్డ ప్రయాణీకులు ఆర్టీసీ పండిట్ నెహ్రూబస్ స్టేషన్నందు తలదాచుకున్నారు. అలాగే విజయవాడ – హైదరాబాదు మార్గంలో వరదల కారణంగా బస్సులను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగినది. అందువలన చాలా మంది ప్రయాణీకులు నిన్నటి (01.09.2024) నుంచి ఆర్టీసీ పండిట్ నెహ్రూబస్ స్టేషన్లోనే వున్నారు. ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు, ఈ పరిస్థితిని సమీక్షించిన అధికారులు వెంటనే అప్రమత్తమై గత అర్ధ రాత్రి (01.09.2024) ఆర్టీసీ పండిట్ నెహ్రూబస్ స్టేషన్ లో ఆశ్రయం పొందిఉన్న దాదాపు దాదాపు 2000 మందికి అప్పటికప్పుడు భోజన ఏర్పాట్లు చేయించి వారందరికీ స్వయంగా అందజేయటం జరిగింది. కాగా, ఈ రోజు ఉదయం (02.09.2024) మరో 30,000 మందికి భోజన ఏర్పాట్లు చేయించి ఆర్టీసీ పండిట్ నెహ్రూబస్ స్టేషన్మరియు విజయవాడ లోని ఇతర లోతట్టు ప్రాంతాల వరద బాదితులకు అందేవిధంగా తగిన ఏర్పాట్లు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *