Breaking News

పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు

-బాలికలకు అదనపు పోషక ఆహారం గా మునగాకు పొడి అందజేయాలి
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కౌమార దశ లోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాల్లో భాగస్వామ్యం  పోషన్ ప్లస్ 2.2 వెర్షన్ ను అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి మునగాకు పొడి పంపిణీ చేయడాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పోషన్ ప్లస్ కార్యక్రమం పై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భం గా కలెక్టర్ పి . ప్రశాంతి మాట్లాడుతూ, ఎనీమియా లోపం వల్ల రక్త హీనత కలిగి కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయని, మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నయో లేదో నిర్ధారణ చేసుకోవడం ముఖ్యం అన్నారు. అక్రమంలో జిల్లాల్లో తొలి విడత గా 2700 మంది సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఉన్న బాలికలకి మునగాకు పొడి అందచేసి మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. పిల్లలు చిన్నతనం నుంచే ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు చేసుకొవాలని , ఆమేరకు వారిలో అవగాహన కల్పించడం ముఖ్యం అని తెలియ చేశారు. గతంలో చిరు ధాన్యాలు, రాగులు జొన్నలు సజ్జలు ఆహారంలో తీసుకునే వారన్నారు. నేడు ఫాస్ట్ ఫుడ్, పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల రక్త హీనత కు గురి అవ్వడం చూస్తున్నామని తెలిపారు.

కౌమార దశలో ఉన్న బాలికలకు మునగాకు పౌడర్ ఇవ్వటం జరుగుతోందనీ, రోజు విడిచి రోజు తప్పకుండా  ఆహారంలో మునగాకు తీసుకోవడం వల్ల రక్త హీనత ను అధిగమించడం సాధ్యం అవుతుందని అన్నారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాలలో ఉన్న బాలికలకు ప్రభుత్వం అందచేస్తున్న  వాటికి అదనంగా “ప్రాజెక్ట్ ఐరెన్ ప్లస్ ” కార్యక్రమం ద్వారా మునగాకు పోడి అందజేసే కార్యక్రమాన్ని అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొనసాగించేలా ప్రణాళికలతో రావలని తెలిపారు.

ఆరోగ్య పరిరక్షణపై , మంచి పోషక విలువలు కలిగిన ఆహారంలో  తప్పకుండా తీసుకుని రావడం పై జిల్లా వ్యాప్తంగా గణాంకాల వివరాల ను సేకరించి యుక్త వయసులో వున్న బాలికలకు అందించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో తొలిదశలో చేపట్టిన కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు రావడం జరిగిందని అధికారులు తెలిపారు. ఎస్సి ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలలో సుమారు కౌమర దశలో ఉన్న బాలికలు 3000 వేల మంది వరకూ ఉన్నట్లు అధికారులు వివరించారు. ఎస్టీ సంక్షేమ వసతి గృహాలలో 1243 బాలికలు, బీసీ సంక్షేమ వసతి గృహాలలో 809 మంది ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సమన్వయ కర్త గా డా ఎన్. వసుంధర, డి ఎమ్ హెచ్ వో డా కే. వేంకటేశ్వర రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎన్ జ్యోతి, జిల్లా బిసి సంక్షేమ అధికారి బి. శశాంక, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎమ్. సందీప్ లు  పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *