-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల దశ నుంచే క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా విద్యార్థులను తయారు చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో జరుగుతున్న అండర్ – 19 బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభ వేడుకలకు ఆత్మీయ అతిథిగా సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల నిర్వహణకు సంబంధించి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) కు రావలసిన నిధులు ఈవారంలో విడుదల చేస్తామన్నారు. ఈ సంవత్సరం కూడా పాఠశాలలకు అవసరమైన నాణ్యమైన క్రీడా సామగ్రిని అందజేస్తామని అన్నారు. జిల్లాలో 32 పాఠశాలలకు పీఎంశ్రీ పథకంలో భాగంగా క్రీడాస్థలాల నిర్మాణం కోసం ఒక్కో పాఠశాలకు రూ.5 లక్షల చొప్పున నిధుల మంజూరయ్యాయని, ఇప్పటికే కొంత నిధులు విడుదల చేశామని తెలిపారు. వాటిని ఖర్చు చేసిన తర్వాత మిగిలిన గ్రాంట్ కూడా విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాది ‘పాఠశాల పిల్లలకు క్రికెట్ పోటీలను పాఠశాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వం నిర్వహించబోతుందని, అందుకు సన్నద్ధం కావాలని కోరారు.అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తో క్రీడా విద్యకు సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు. జిల్లా విద్యాశాఖాధికారి డా. తిరుమల చైతన్య పాల్గొన్న ఈ సందర్భంగా 12 ఉమ్మడి జిల్లా బృందాల నుండి సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు రావు గౌరవ వందనం స్వీకరించారు. మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడల్లో 146 మంది బాలికలు, 27 మంది కోచ్ మేనేజర్లు పాల్గొన్నారు.