Breaking News

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన రాష్ట్ర డి.జి.పి. సి.హెచ్.ద్వారకాతిరుమల రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని ది.21.10.2024 తేదిన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర డి.జి.పి. సి.హెచ్.ద్వారకాతిరుమల రావు ఐ.పి.ఎస్. , నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్  ఇతర అధికారులతో కలిసి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నందు జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వి.వి.ఐ.పి.లు/వి.ఐ.పి.లు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కు వస్తారు కనుక స్టేడియం నందు కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్టేడియం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన భద్రత చర్యలు చేపట్టాలని అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం పోలీస్ పరేడ్ ను పర్యవేక్షించి తగు సూచనలును జారీచేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర డి.జి.పి. సి.హెచ్.ద్వారకాతిరుమల రావు ఐ.పి.ఎస్. గారు, నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్, లా & ఆర్డర్ ఐ.జి. శ్రీకాంత్ ఐ.పి.ఎస్., డి.ఐ.జి.లు రాజకుమారి ఐ.పి.ఎస్., అమ్మిరెడ్డి ఐ.పి.ఎస్., ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *