అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన నిడమర్రు గ్రామానికి 20 మంది రైతులకు శనివారం 2026 నవంబర్ 7న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా 77 రిటర్నబుల్ ప్లాట్లను అధికారులు కేటాయించారు. కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారు, ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) విభాగ డైరెక్టర్ కె.ఎస్.భాగ్యరేఖ గారు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. రాజధాని నిర్మాణం కోసం ఇటీవల భూములు అందజేసిన నిడమర్రు గ్రామానికి చెందిన 20 మంది రైతులకు శనివారం 77 ప్లాట్లను కేటాయించారు. వీటిలో 52 రెసిడెన్షియల్, 25 కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి.
రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని అడిషనల్ కమిషనర్ గారు కోరారు. ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.భద్రు, గుంటూరు LPS కో ఆర్డినేషన్ డిప్యూటీ కలెక్టర్ వి.డేవిడ్ రాజు, ల్యాండ్స్, IT, ప్లానింగ్, GIS, కమ్యూనికేషన్స్ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.
