విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ (విలువిద్య) పోటీలకు విజయవాడలోని శాతవాహన కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఆర్చరీ క్రీడలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. అస్సాంలోని తేజ్పూర్ యూనివర్సిటీ వేదికగా డిసెంబర్ 15 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పురుషుల, మహిళల ఆర్చరీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు నిర్వహించిన ఎంపిక పోటీల్లో సాతవాహన కళాశాలకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఎంపిక పోటీల్లో 50 మీటర్ల కాంపౌండ్ విభాగంలో మహిళల కేటగిరీలో బి. విభాగానికి చెందిన క్రీడాకారిణి 688 పాయింట్లు సాధించగా, పురుషుల కేటగిరీలో కె. భరత్ కుమార్ 674 పాయింట్లు సాధించారు. వీరు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలని, జాతీయ స్థాయిలో విజయాలు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన డా. బి.సి.హెచ్. సంగీతరావు మరియు ఇతర నిర్వాహకులు క్రీడాకారులను అభినందించి ప్రోత్సహించారు. విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అవసరమైన సహకారం అందిస్తోందని తెలిపారు. క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కళాశాల యాజమాన్యం ఆకాంక్షించింది.
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ పోటీలకు శాతవాహన కళాశాల విద్యార్థుల ఎంపిక
