విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సీతారాంపురంలోని దీపక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, వైద్య సలహాలు అందించనున్నట్లు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పి. సురేష్ కుమార్ తెలిపారు.
శిబిరంలో ఓపీ కన్సల్టేషన్, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఈసీజీ, ఎకో పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తారు. రక్త పరీక్షలపై 50 శాతం, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే పరీక్షలపై 20 శాతం రాయితీ కల్పించనున్నట్లు వెల్లడించారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. ఈ శిబిరం విజయవాడ సీతారాంపురం, బోయపాటి వారి వీధిలోని దీపక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించనున్నారు.
