విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగర డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టిన చెన్నుపాటి క్రాంతిశ్రీ బుధవారం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బుద్ధా వెంకన్నను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న, ఆయన సతీమణి భూలక్ష్మి కలిసి క్రాంతిశ్రీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు. డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
విజయవాడ నగర అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కృషి చేయాలని ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న దంపతులు ఆకాంక్షించారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలని సూచించారు.
డిప్యూటీ మేయర్ చెన్నుపాటి క్రాంతిశ్రీకి బుద్ధా వెంకన్న దంపతుల సత్కారం
