విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక గొల్లపాలెం గట్టు కస్తూరిబాయి ఆశ్రమం ఎదురు రోడ్డు వద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రాము గురుస్వామి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు.
అనంతరం వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ అయ్యప్ప స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ మహా పడిపూజ మహోత్సవంలో అయ్యప్ప మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
