పశ్చిమ లో కదం తొక్కిన కమలదళం

-అడ్డూరి శ్రీరామ్ కు మద్దతుగా బైక్ ర్యాలీ
-49 వ డివిజన్ బీజేపీ అభ్యర్ధి అడ్డూరి శ్రీరామ్ కు మద్దతుగా కమల దళం కదం తొక్కింది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శ్రీరామ్ కు మద్దతుగా బీజేపీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. కొత్తపేట నుంచి కోమల విలాస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ డి విల్సన్ మాట్లాడుతూ అవినీతికి తావులేని సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టిడిపి, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి అడ్డూరి శ్రీరామ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.