బాధితులకు ఎల్ఓసి పత్రాలు అందజేత

-కూటమి నాయకులతో కలిసి అందజేసిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ఎల్ ఓ సీ పత్రాలు మంజూరయ్యాయి. కొత్తపేటలో నివాసముంటున్న కోలా వెంకటేశ్వరరావు (42) రోడ్డు ప్రమాదంలో గాయపడగా అత్యవసర వైద్యం నిమిత్తం రూ 10 లక్షల ఎల్ ఓ సీ మంజూరైంది. భవానిపురానికి చెందిన చీదెళ్ళ హేమ సుందరరావు (58) బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 7.98 లక్షల ఎల్ ఓ సీ మంజూరైంది. ఊర్మిళ నగర్ కు చెందిన మూలకా ఆది రెడ్డి (55) భవనం పై నుంచి పడి గాయపడగా అత్యవసర వైద్యం కోసం రూ 6.35 లక్షల విలువైన ఎల్ ఓ సీ అదేవిధంగా ప్రైజర్ పేటకు చెందిన కలకోటి నాగలక్ష్మి (28) తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 2.80 లక్షల ఎల్ ఓ సీ మంజూరైంది. ఆ పత్రాలను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

47వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఈగల సాంబశివరావు, 40 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు బొల్లేపల్లి కోటేశ్వరరావు, బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షర్మిల, మహంతిపురం బీజేపీ మండల అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి,
టీడీపీ నాయకులు నల్లిబెల్లి కనకరావు, ముదిరి శ్రీను, దుర్గా సురేష్ తదితరులు పాల్గొన్నారు.