-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచనలు సమాజానికి శాశ్వత స్ఫూర్తిని అందిస్తున్నాయని, వాల్మీకి బోధించిన విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి జీవితాన్ని, సాహిత్య సేవలను స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఏ. రవీంద్రరావు, కె. శకుంతల, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
