-విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలకు వివిధ ప్రభుత్వ శాఖల వారికి, స్వచ్చంద సంస్థల వారికి, మీడియా ప్రతినిధులు మరియు అన్నివిధములుగా సహకరించిన ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ది.07.10.2021వ తేదీ నుండి 15.10.2021వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకుని దసరా …
Read More »Konduri Srinivasa Rao
విద్యుత్ కోతలపై దుష్ప్రచారాన్ని ఖండించిన రాష్ట్ర ఇంధనశాఖ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ కోతలపై దుష్ప్రచారాన్ని ఖండించిన రాష్ట్ర ఇంధనశాఖ ఖండించింది. దసరా పండుగ తర్వాత గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో, నగరాల్లో లోడ్ రిలీఫ్ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇంధనశాఖ అధికారులు ఖండించారు. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఎపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న …
Read More »ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత అనుగ్రహం ఉండాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మాత ఆశీస్సులతో రాష్ట్రం, ప్రజలు అందరూ సుఖ:శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత అనుగ్రహం ఉండాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం పార్లమెంటరీ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా కార్యక్రమాలు చాగల్లు గ్రామంలో …
Read More »కన్నుల పండుగ్గా తెప్పోత్సవం…
-భక్తిపారవశ్యంతో పులకరించిన దుర్గా ఘాట్… -జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ అంటూ జగన్మాతను స్మరించుకున్న భక్తజనకోటి… ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత శ్రీ కనక దుర్గాదేవికి పవిత్ర కృష్ణానదిలో హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు. హంసవాహనంపై ఉత్సవ విగ్రహాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించిన హంస వాహనంలో ఆదిదంపతులు దుర్గామల్లేశ్వరస్వామివార్లు కొలువుతీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. దాదాపు గంటన్నరపాటు తెప్పోత్సవం వైభవంగా …
Read More »శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గమ్మ ఆలయాల్లో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా అద్భుతంగా జరిగాయని, ఇందుకు అన్ని శాఖలు, ముఖ్యంగా భక్తులు, మీడియా సహకారం ఎంతో ఉందని రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయదశమి పర్యదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్లు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలోని అన్నిశాఖల …
Read More »శ్రీరాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ దర్శనం…
-భవానీలు, భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో చివరి రోజైన “విజయదశమి” సందర్భంగా శ్రీ అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరాజరాజేశ్వరీదేవి అవతారంలో వున్న అమ్మవారిని దర్శించుకొంటే అంతా జయమే కలుగుతుందని వేదాలలో చెప్పబడింది. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారి దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరారు. రాష్ట్రం నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల నుండి భవానీ దీక్షాదారులు అమ్మవారిని దర్శించుకొనేందుకు బారులు తీరారు. దీనితో క్యూలైన్లు భక్తులతోపాటు …
Read More »విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై ఘనంగా విజయదశమి వేడుకలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామి వారికీ అభిషేకం, అనంతరం అలంకరణ, అష్టోత్తర శతనామార్చన ఎంతో వైభవంగా జరిగాయి. విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై శమిపూజ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి వారు హస్వ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు.
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధికి చేరుకున్న సీజేఐ తొలుత మూలమూర్తిని దర్శించుకుని రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జస్టిస్ ఎన్వీ రమణకు వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్ధప్రసాదాలను, చిత్ర పటాలను అందజేశారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, …
Read More »గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు…
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దసరా పండుగ సందర్భంగా ఊరు ఊరు కో జమ్మిచెట్టు గుడి గుడి కో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టు ను నాటారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.దసరా పర్వదినాన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చింది. షడ్భుజి …
Read More »హంసవాహన తెప్పోత్సవ కార్యక్రమానికి సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హంసవాహన తెప్పోత్సవ కార్యక్రమానికి సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. దుర్గా ఘాట్ ఇరిగేషన్ మోడల్ గెస్టుహౌస్లో గురువారం ఇరిగేషన్ , టూరిజం, రెవిన్యూ, పోలీస్, ఫైర్, మత్స్యశాఖ అధికారులతో తెప్పోత్సవం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జె. నివాస్ సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణానదిలో నీటి సామర్ధ్యం ఎక్కువగా ఉన్నందున ఈ ఏడాది దుర్గాఘాట్లోనే నిలకడగానే ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దుర్గాఘాట్లో పరిమితి సంఖ్యలో ప్రొటోకాల్ …
Read More »