ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గమ్మ ఆలయాల్లో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా అద్భుతంగా జరిగాయని, ఇందుకు అన్ని శాఖలు, ముఖ్యంగా భక్తులు, మీడియా సహకారం ఎంతో ఉందని రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయదశమి పర్యదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్లు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలోని అన్నిశాఖల సమన్వయంతో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. జి. వాణి మోహన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాస్, విఎంసి కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్ తదితర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు పోలీస్, వైద్యఆరోగ్యం , ఇరిగేషన్, దేవాదాయశాఖ, ఆలయ అధికారులు, సిబ్బందిని దేవాదాయశాఖ తరపున ప్రత్యేకంగా అభినందిస్తునన్నారు. ముఖ్యంగా భక్తులు చాలా సంయమనంతో దుర్గమ్మను దర్శించుకున్నారని యంత్రాంగానికి వారు ఇచ్చిన సహకారం ఎంతో అభినందనీయమని చెప్తూ భక్తులకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారు ఆయా రూపాల్లో అలంకారాలను భక్తులు వీక్షించారన్నారు. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున సుమారు లక్ష పైగానే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్నచిన్న ఇబ్బందులు వచ్చిన అమ్మవారి దయతో అంత సాఫీగా దసరా ఉత్సవాలు జరిగాయన్నారు. శుక్రవారం విజయదశమి రోజున తెల్లవారు జామున 3 గంటల నుంచి అమ్మవారిని భక్తులు ఎంతో సమన్వయం, సంయమనం తో దర్శించుకుంటున్నారన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దుర్గమ్మ దర్శనానికి ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంత్రి వెంట దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. జి. వాణిమోహన్ కూడా ఉన్నారు.
Tags indrakiladri
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …