Breaking News

Konduri Srinivasa Rao

పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వీడియో సందేశం… దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో గతంలో ఎప్పుడూ చూడని అపూర్వ విజయం మధ్య ఈరోజు నేను మాట్లాడుతున్నాను. పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు; శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి ఘన విజయం అందించిన ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు; …

Read More »

ఎన్.యస్.యు.ఐ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ (స్టేట్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్)గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ నియామకం… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ (స్టేట్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్)గా నియమించడం జరిగింది. తన పై నమ్మకం వుంచి మరలా రెడవసారి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ నగేష్ కరియప్పలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ… భవిష్యత్తులో ఎన్.యస్.యు.ఐ. బలోపేతం చేయడానికి నావంతు కృషి చేస్తానని, రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల …

Read More »

సమిష్టి నిర్ణయాలతో ఆదర్శంగా నిలుపుదాం… : ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి  

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ సభ్యుల నిర్ణయాలతో గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేలా సమిష్టి నిర్ణయాలతో ఆదర్శంగా నిలుపుదామని ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి పేర్కొన్నారు. సోమవారం కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ లో అత్యవసర సమావేశానికి ఛైర్ పర్సన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ కోర్ట్ ఉత్తర్వులు మేరకు కాంట్రాక్టర్ కి చెల్లింపు చెయ్యవలసిన సుమారు రూ.11 లక్షలు సాధారణ నిధుల నుండి చెల్లించడానికి సభలో ప్రవేశ పెట్టిన అంశాన్ని కౌన్సిల్ …

Read More »

మండల, సచివాలయ స్థాయిలో తీసుకునే ప్రతి ఫిర్యాదు కి రసీదులు ఇవ్వాలి.. : జేసి (ఆసరా) పి.పద్మావతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా), కొవ్వూరు ఇంఛార్జి ఆర్డీవో పి. పద్మావతి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా పి. పద్మావతి మాట్లాడుతూ, ప్రజలు అందచేసే వినతుల పరిష్కారానికి జవాబుదారీతనం తో అధికారులు, సిబ్బంది వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందన్నారు. ప్రజలు అందించే దరఖాస్తు …

Read More »

కొవ్వూరు మండల వనరుల కేంద్రాన్ని, జెడ్పీ బాలికల పాఠశాల, ఎమ్ పిపి స్కూల్స్ ను ఆకస్మిక తనిఖీ…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రెండో దశ నాడు నేడు కింద పాఠశాలలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చెయ్యడం జరుగు తుందని విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల డి. మధుసూదన్ రావు తెలిపారు. సోమవారం కొవ్వూరు మండల వనరుల కేంద్రాన్ని, జెడ్పీ బాలికల పాఠశాల, ఎమ్ పిపి స్కూల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసారు.  ఈ సందర్భంగా మధుసూదన్ రావు, మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన నాడు నేడు …

Read More »

సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించండి… : సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్

-స్పందనలో 69 అర్జీల రాక… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధసమస్యల పరిష్కారానికి 69 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి. ఎస్ఎస్ ప్రవీణ్ చంద్. తెలిపారు.వీటిలో అత్యధికంగా రెవెన్యూ 23, పురపాలక 15, పోలీస్ శాఖ 3, సెర్ప్ 11, పంచాయతీరాజ్ 9, ఇతర శాఖలు 8 చొప్పున మొత్తం 69 దరఖాస్తులు అందాయన్నారు.నడిచేందుకు వీలుకాని పరిస్థితుల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతురాలైన విజయవాడకు చెందిన తిరుమల కొండ పూజిత కు …

Read More »

విజయవాడ నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యత… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-స్ట్రీట్స్ ఫర్ పీపుల్ ఛాలెంజ్ లో భాగంగా రూ.33 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర సుందరీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ‘స్ట్రీట్స్ ఫర్ పీపుల్ ఛాలెంజ్’లో భాగంగా 33వ డివిజన్ లో శివాలయం వీధి నుండి బీఆర్టీఎస్ రోడ్డు వరకు రూ. 33.20 లక్షలతో ప్రధాన రహదారి సుందరీకరణ పనులకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి లతో కలిసి ఆయన శంకుస్థాపన …

Read More »

పరిషత్ ఫలితాలతో మరోసారి చంద్రబాబు కంచుకోటలకు బీటలు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-జగనన్న ప్రభుత్వానికి రెండేళ్లల్లో రెట్టింపైన ప్రజాదరణ… -తెలుగుదేశం అధ్యాయం ముగిసిందనడానికి కుప్పం ఫలితమే నిదర్శనం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యాయం ముగిసిందనడానికి కుప్పం ఫలితాలే నిదర్శనమని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలోని ఏ బ్లాక్ లో డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు, ప్రజా సమస్యలపై ఆరా తీశారు. కాలువలన్నీ చెత్తాచెదారంతో పూడుకుపోవడంపై  శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా అధికారులకు …

Read More »

మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మాస్టర్ భువన్…

-పిన్న వయస్సులో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తొలి భారతీయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యూరప్ ఖండంలోనే ఎతైన శిఖరంగా పేరుగాంచిన రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి మాస్టర్ గంధం భువన్ చరిత్ర సృష్టించారు. కేవలం ఎనిమిది సంవత్సరాల మూడు నెలల వయస్సులో భువన్ దీనిని సుసాధ్యం చేసారు. ఈనెల 18వ తేదీన 5642 మీటర్ల ఎత్తెన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని చేరుకున్న అతి పిన్న వయస్కుడైన భారతీయునిగా రికార్డుల సృష్టించారు. ఏ మాత్రం అనుకూలత లేని భిన్నమైన వాతావరణంలో ఎంతో …

Read More »

వాతావరణ సూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర తమిళనాడు మరియు పొరుగు ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు సగటు సముద్రమట్టం కంటే 1.5 కి.మీ ఎత్తులో తమిళనాడు తీరంలో కొనసాగుతున్నది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి …

Read More »