అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర తమిళనాడు మరియు పొరుగు ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు సగటు సముద్రమట్టం కంటే 1.5 కి.మీ ఎత్తులో తమిళనాడు తీరంలో కొనసాగుతున్నది.
వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.