-కేంద్రమంత్రితో కలిసి ‘క్వాంటం వ్యాలీ’కి రేపు సీఎం చంద్రబాబు శంకుస్థాపన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపుతిప్పే చారిత్రక ఘట్టానికి అమరావతి శనివారం వేదికగా నిలవనుంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి రేపు పునాదిరాయి పడుతోంది. దీని ద్వారా భారతదేశం క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం రాష్ట్రానికి రానుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి …
Read More »All News
నగరంలో ‘శ్రీవిద్య లగ్జరీ షోరూమ్’ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో వారసత్వ ఫ్యాషన్ కోసం ఒక కొత్త గమ్య స్థానం ‘శ్రీవిద్య లగ్జరీ షోరూమ్’ ఆవిష్కృతమైంది. శుక్రవారం బందరురోడ్డులో అత్యంత ప్రీమియం షోరూమ్ ‘శ్రీవిద్య లగ్జరీ షోరూమ్’ను సినీనటి పాయల్ రాజ్‌పుత్ ప్రారంభించగా గౌరవ అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సండర్భంగా సినీనటి పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ… తనకు చీరల సొగసు శాశ్వతత్వం అంటే ఎప్పుడూ చాలా ఇష్టమన్నారు. శ్రీవిద్య కలెక్షన్ నిజంగా మంత్రముగ్ధులను చేసేలా వుందన్నారు. ముఖ్యంగా సాంప్రదాయ నేతలను …
Read More »నగరంలో ఎస్ ఎస్ గిఫ్ట్ ఐటమ్స్ ఈవెంట్స్, డెకరేషన్ ఐటమ్స్ షాపు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఎస్ ఎస్ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ షాప్ నూతనంగా ప్రారంభించారు. శుక్రవారం ఏలూరు రోడ్ లో సీతారామపురం జంక్షన్ వద్ద సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అయిన బోండా ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ ఎస్ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ షాపు యాజమాన్యానికి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభకార్యాలకు ఈవెంట్స్ నిర్వహించటం డెకరేషన్ చేయడంలో సుమారు పది సంవత్సరాల పైన అనుభవం …
Read More »రైజ్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి
– మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త గుంటుపల్లిలోని రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ (రైజ్)లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ శుక్రవారం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని సందర్శించి, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి, అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి …
Read More »స్వర్ణాంధ్రకు అక్షరాంధ్ర సౌరభాలు
– కార్యక్రమం విజయవంతానికి నిరంతర పర్యవేక్షణ – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని నిరక్ష్యరాస్యులు అక్షరాస్యులుగా మారి.. బంగారు భవితకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. అక్షర జ్ఞానాన్ని పొందుతున్న మహిళలతో మాట్లాడి, వారి అభ్యసన సామర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన …
Read More »బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధితురాలి కుటుంబానికి అండగా ఉండి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మెడికో దీపిక మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ శుక్రవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో చైర్ పర్సన్ మాట్లాడుతూ.. మెడికో దీపిక …
Read More »కచ్చితత్వంతో ఏకీకృత కుటుంబ సర్వే
– సేవల పంపిణీని మెరుగుపరిచేందుకు వీలు – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాల లక్ష్యసాధన, సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణ, సేవల పంపిణీని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్‌బీఎంఎస్)ను అభివృద్ధి చేస్తోందని.. ఇందులో భాగంగా అత్యంత కచ్చితత్వంతో ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఏకీకృత కుటుంబ …
Read More »స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రతి ఉద్యోగి భాగస్వాములవ్వాలి
– పేదరికంలేని సమాజ నిర్మాణానికి తమ వంతు సేవలందించాలి – నూతన సాంకేతిక విధానంతో పారదర్శకంగా ప్రజలకు దగ్గరవ్వాలి -రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమ, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 లక్ష్యసాధనలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. …
Read More »RTIH–ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల మధ్య అవగాహన ఒప్పందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎనికేపాడు, విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) మరియు ఉషారామా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మధ్య 06-02-2026న అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. విద్యార్థుల్లో నవోత్తేజం, ఉపాధి సృష్టి మరియు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం. ఈ MoUపై RTIH ముఖ్య కార్యనిర్వాహక అధికారి జి. కృష్ణన్, పార్ట్‌నర్‌షిప్స్ హెడ్ నందన్ టాండి , ఉషారామా కాలేజ్ ప్రిన్సిపాల్ డా. జి.వి.కె.ఎస్.వి. ప్రసాద్ మరియు డా. కె.వి. శివ …
Read More »పదో తరగతి పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే
-విద్యార్థులు పరీక్షల దృష్ట్యా ఒత్తిడి, భయాందోళన చెందవద్దు -విద్యార్థులతో కలిసి పరీక్షా పే చర్చ కార్యక్రమం వీక్షించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు. వి IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పరీక్షలు జీవితంలో ఒక భాగమేనని, పరీక్షల విషయంలో విద్యార్థులు ఎలాంటి భయాందోళన, ఒత్తిడి చెందవద్దని, సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నాపత్రం సమాధానాలు మూల్యాంకనం చేసే వ్యక్తి ఆ ప్రశ్న ద్వారా విద్యార్థుల విషయ అవగాహనను ఏమి ఆశిస్తున్నారు తెలుసుకొని సమాధానాలు రాయాలని, ప్రశ్నకు సంబంధించి ముఖ్యమైన విషయాలను …
Read More »
Prajavartha Online Telugu News