Breaking News

Andhra Pradesh

నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోని హరిత (green) బాణసంచా కాల్చుకోవాలని, వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని సూచించారు. టపాసులు కాల్చుకొనే సమయంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటైజర్ కు దూరంగా ఉంటు ఏ విధమైన ప్రమాదాలు జరుగకుండా ఆనందంగా సంతోషకరంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read More »

3వ డివిజన్ లో రూ.19.85 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు ప్రారంభo…

-నగరాభివృద్ధియే లక్ష్యంగా వై.సి.పి పాలన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరెన్సీ నగర్ 3వ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటి హాల్ మొదటి అంతస్తు ప్రారంభ కార్యక్రమములో నగర మేయర్ శ్రీ‌మ‌తి రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. డిప్యూటి మేయ‌ర్ బెల్లం దుర్గ‌, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళికతో కలసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ.19.85 లక్షల నగరపాలక సంస్థ …

Read More »

దీపావళి శుభాకాంక్షలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల జీవితాల్లో అమావాస్య చీకట్లు తొలగిపోయి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలతో ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటూ విజయవాడ నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తెలియజేశారు.

Read More »

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి శాసనసభ్యులు మల్లాది విష్ణు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో చీకట్లను తొలగించి కోటి ఆనందాల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ప్ర‌తీ ఇంటి లోగిలి దీప‌కాంతుల‌తో వెలుగులీనాల‌ని.. నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా, ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా …

Read More »

దివ్యాంగుల కోటాలో రైతుబజార్లో స్టాల్ ను కేటాయించండి…

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి వినతి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల కోటాలో గుడివాడ రైతుబజార్లో స్టాలు కేటాయించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను కోరారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నందివాడ మండలం పాత రామాపురానికి చెందిన నత్తా మధు కలిశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గుడివాడ రైతుబజార్లో స్టాల్ కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. స్టాల్ కేటాయించి …

Read More »

జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల్లో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం జరుగుతుందని, ఈ మేరకు సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, అభివృద్ధి సంఘం …

Read More »

చీకటిని పారదోలుతూ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి…

-తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : చీకటిని పారదోలుతూ అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను జాతి, కుల, మత, వర్గ విబేధాలను విస్మరించి సమైక్యంగా …

Read More »

బుధవారం నాడు ఎంపిటిసి స్థానాలకు 6, గ్రామ వార్డుకి ఒక నామినేషన్ దాఖలు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు పరిధిలో ఒక జెడ్పీటిసి, 7 ఎంపిటిసి , 5 గ్రామ పంచాయతీ వార్డులు , కొవ్వూరు పురపాక సంఘం లోని ఒక వార్డు స్థానాల ఎన్నికలకు ఈరోజు నామినేషన్ ల స్వీకారానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈరోజు ఆర్వో లు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్డీవో మల్లిబాబు నామినేషన్లు వివరాలు …

Read More »

కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, కార్తీక మాసంలో గోదావరి నది లో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు తాకిడిని దృష్టిలో పెట్టుకొని అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్ పరిస్థితి నెలకొని, థర్డ్ వేవ్ హెచ్చరికలు చేయడంతో ఎటువంటి …

Read More »

కుమారి గెడ్డం స్రవంతి మృతిపై నవంబర్ 5 న విచారణ

-మార్టేరు ఎస్.సి.సంక్షేమ వసతి గృహం లో ఉ..10.30 లకు విచారణ -విచారణ కమిటీ కి తగిన వివరాలు, ఆధారాలు అందచెయ్యగలరు -ఆర్డీవో ఎస్. మల్లిబాబు తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ నందు 8వ తరగతి చదువుతున్న గెడ్డం సురేష్ వారి కుమార్తె కుమారి గెడ్డం స్రవంతి ఆక్టోబరు 28 వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగినదని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ – పశ్చిమగోదావరి జిల్లా వారు విచారణాధికారిగా …

Read More »