-ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి నైవేద్యంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం అత్యంత ఆందోళనకరమని తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు పేర్కొన్నారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకైన శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించింది. తిరుపతి హరే రామ హరే కృష్ణ టెంపుల్ వద్ద నుండి …
Read More »Latest News
భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ
-తిరుమల లడ్డు వ్యవహారంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు -రాజకీయాలకతీతంగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలతో రౌండ్ టేబుల్ నిర్వహించాలి- -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ కక్షసాధింపుగా మలిచే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, కోట్లాది భక్తుల …
Read More »ఆంధ్రప్రదేశ్ ‘అజ్ఞాత అద్భుతాల’ ఆవిష్కరణకు పర్యాటక శాఖ వినూత్న ప్రయోగం
-ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా గ్రామీణ పర్యాటకానికి కొత్త ఊపిరి -వాలంటీర్ యాత్ర సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం..తద్వారా 9 మిలియన్లకు పైగా వ్యూస్, 1,000కి పైగా బుకింగ్ ఎంక్వైరీలు -తక్కువ ఖర్చుతో ఏపీ పర్యాటకానికి జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు – అత్యధిక ప్రభావం చూపే సరికొత్త ప్రచార నమూనాకు శ్రీకారం -ఏపీ పర్యాటక రంగాన్ని కేవలం కొన్ని ప్రదేశాలకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు …
Read More »ఫిబ్రవరి 9న జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం రద్దు
-ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9వ తేదీ (సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న 3వ మంత్రులు–కార్యదర్శుల సదస్సు (Ministers’ and Secretaries’ Conference)కు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు మరియు ఇతర జిల్లా అధికారులు వారి బృందం వర్చువల్ విధానంలో హాజరు కావాల్సి ఉన్నందున, ఫిబ్రవరి 9 న జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని రద్దు …
Read More »డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ తూర్పుగోదావరి ఎస్ఈ కె తిలక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభిస్తారన్నారు. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వినియోగదారులు ఫోను నెంబరు 8688400499 ద్వారా విద్యుత్ సమస్యలను తెలియజేయ వచ్చన్నారు. ఫిబ్రవరి 9న …
Read More »బాలికల హక్కులు, భద్రతపై అవగాహన కల్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి ప్రభుత్వ బాలికల సదనాన్ని సందర్శించి అక్కడ బాలికలకు అందుతున్న వసతులు, సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నివసిస్తున్న బాలికలతో సన్నిహితంగా మాట్లాడి వారి విద్య, ఆరోగ్యం, భద్రత, భోజనం, దైనందిన అవసరాలు తదితర అంశాలపై వివరాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అడిగి తెలుసు కున్నారు. బాలికలు బాగా …
Read More »సహజ వన్యప్రాణి లక్షణాలకనుగుణంగా ప్రవర్తించిన పులి – నాలుగు గంటలు పాకలో ఉన్నా పశువులకు హాని చేయలేదు
-జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు -అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అప్రమత్తత ప్రశంసనీయం : కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక పులి గుడిసె ఇంట్లోకి ప్రవేశించి, అదే పాకలో సుమారు నాలుగు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఎస్.హెచ్.జి మహిళల స్వయం ఉపాధికి ఎంపీ కేశినేని శివనాథ్ తోడ్పాటు
-ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతాయ్య) -హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక బస్సులో బయలుదేరిన 40 మంది ఎస్.హెచ్.జి మహిళలు -జెండా ఊపి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) -కేశినేని ఫౌండేషన్ – ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీ పై శిక్షణ -పిబ్రవరి 9వ తేదీ నుంచి 13 వరకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్రధాన కార్యాలయంలో ఐదు రోజుల శిక్షణ -ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో ఎస్.హెచ్.జి మహిళలకు 11వ నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం జగ్గయ్యపేట, …
Read More »ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »కృష్ణమ్మ ఒడిలో కవితా నీరాజనం.. కవులే సమాజానికి మార్గదర్శకులు: మంత్రి కందుల దుర్గేష్
-కృష్ణా తీరం కవితా హారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -బోధిసిరి నౌకలో 51 మంది కవుల కవితా గానం – స్వయంగా వీక్షించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రవ్యాప్త నదీ తీరాల్లో ఇలాంటి సాహిత్య కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చూడతామని హామీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి ఒడిలో సాగే సాహిత్య సమ్మేళనాలు సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ …
Read More »
Prajavartha Online Telugu News