Breaking News

Latest News

వంద కోట్ల విక్రయాలే లక్ష్యంగా ఆప్కో కార్యాచరణ

-చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత -నూతన డిజైన్లు, ఆధునిక షోరూమ్ ల ఏర్పాటు : చిల్లపల్లి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వంద కోట్ల విక్రయాలే లక్ష్యంగా ఆప్కో వార్షిక కార్యాచరణ సిద్దం చేయాలని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత ఆదేశించారు. సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తే చేనేత రంగంలో ఇది సాధ్యమేనని స్పష్టం చేసారు. నూతనంగా చేనేత జౌళి శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సునీత బుధవారం ఆప్కో కేంద్ర కార్యాలయంలో విస్రృత స్ధాయి సమావేశం …

Read More »

పట్టణ ప్రణాళిక విభాగం సమీక్షా సమావేశం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పీకలవాగు మీద ఆక్రమణలను ఇంజినీరింగ్ మరియు పట్టణ ప్రణాలిక అధికారులు సంయుక్తంగా పర్యటించి, గుర్తించిన వాటిని తొలగించడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్  కీర్తి చేకూరి ఐఏయస్  ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాళిక విభాగం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో అవుట్ ఫాల్ డ్రైన్స్ లో పీకలవాగు ప్రధానమైనదని, దీని మీద ఆక్రమణల వలన వర్షాకాలం డ్రైన్ ఓవర్ ఫ్లో జరిగి చుట్టుపక్కల …

Read More »

ఎన్టీఆర్ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గా మనబోతుల నరసింహారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గా మనబోతుల నరసింహారావు కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు లాక వెంగళారావు యాదవ్ బుధవారం విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు యలగాలా నుకానమ్మ , కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు K. సత్యనారాయణ, విజయవాడ టౌన్ అధ్యక్షులు K. లక్ష్మణ్ రావు …

Read More »

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పూర్తి ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది. 29.06.2022, బుధవారం కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో కృష్ణ డీసీసీ బ్యాంకు యొక్క కొత్త TCS సాఫ్ట్వేర్ ను అప్కోబ్ MD ఆర్. శ్రీనాధ రెడ్డి మరియు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్కోబ్ MD మాట్లాడుతూ డీసీసీ బ్యాంకులు ఈ కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించటానికంటే ముందు అప్కోబ్ లో ఒక సంవత్సరం పైగా ఉపయోగంలో ఉందని , దీని …

Read More »

సాంఫీుక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో సీట్ల కొరకు ధరఖాస్తు చేసుకోండి…

-ఏపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐ సోసైటీ అధికారి ఎన్‌ సంజీవరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ సాంఫీుక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 6,7,8,9 తరగతుల నుందు ఖాళీగా ఉన్న సీట్ల కొరకు ధరఖాస్తు చేసుకోవాలని ఏపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐ సోసైటీ అధికారి ఎన్‌ సంజీవరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సాంఫీుక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక పాఠశాల నుండి మరోక పాఠశాలకు బదిలీ చేసే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. బదిలీ కోరుకునే విద్యార్థులు వారికి కావల్సిన గురుకుల పాఠశాల వివరాలతో కూడిన …

Read More »

జిల్లా జైలు సందర్శించిన మహిళా కమిషన్ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జైలులో ఉన్న మహిళా ఖైదీలకూ పోషకాహారం అవసరమని ..పోషక విలువలున్న ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు బూసి వినీత అన్నారు. ఆమె బుధవారం విజయవాడ జిల్లా జైలును సందర్శించారు. జైలులోని మహిళా ఖైదీల రిజిస్టర్ ని తనిఖీ చేశారు. మహిళా ఖైదీల బ్యారెక్ లను పరిశీలించారు. జైల్లో వారికి అందిస్తున్న మెనూను ఆరాతీసి.. సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో జైలు జీవితం అనుభవిస్తున్న మహిళా ఖైదీలు మానసికస్థైర్యం పెంచుకోవడానికి పౌష్టికాహారం …

Read More »

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆగస్టులో ప్రత్యక్ష కార్యాచరణ : అంబటి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆగస్టులో ప్రత్యక్ష కార్యాచరణకు విజయవాడ కేంద్రంగా ఏపీయూడబ్ల్యూజే సిద్దమౌతుందని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన బుధవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్, విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సరికాదన్నారు. జర్నలిస్టుల సంక్షేమకార్యక్రమాలను అమలు …

Read More »

రవాణాశాఖ కమీషనర్ పి. రాజబాబుకు అభినందనలు తెలిపిన ఉద్యోగుల సంఘ నేత యం రాజుబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ బుధవారం పదవీబాధ్యతలు చేపట్టిన పల్లేటి రాజబాబుకు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు యం రాజుబాబు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం యంఐజి ప్రత్యేక అధికారిగా మరియు ఆంధ్రప్రదేశ్ అర్భన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపియుఎఫ్ఎడిసి) యండిగా బాధ్యతలను నిర్వహిస్తున్న పి.రాజబాబును రవాణాశాఖ కమీషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయవాడ ఆర్టిసి బస్టాండ్ ఆవరణంలోగల ఎన్టీఆర్ పరిపాలన భవనంలోని రవాణాశాఖ ప్రధాన …

Read More »

సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల వైపు అడుగులు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-59వ డివిజన్ 235 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ.. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బుధవారం 59 వ డివిజన్ – 235 వ వార్డు సచివాలయం పరిధిలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి …

Read More »

పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59 వ డివిజన్ రామ్ నగర్ లోని నూతన అపార్ట్ మెంట్ల వద్ద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రుహల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, ఏసీపీ రమణమూర్తి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజ నిర్మాణ కోసం ఏటా వర్షాకాలంలో మొక్కలు …

Read More »