Breaking News

పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59 వ డివిజన్ రామ్ నగర్ లోని నూతన అపార్ట్ మెంట్ల వద్ద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రుహల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, ఏసీపీ రమణమూర్తి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజ నిర్మాణ కోసం ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. జగనన్న పచ్చతోరణం పేరిట ఏటా కొన్ని లక్షల మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. ఈ వర్షాకాలంలో ప్రతి డివిజన్ లోనూ కనీసం వెయ్యి మొక్కలు నాటే విధంగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యం, కరోనా లాంటి మహమ్మారి నుంచి బయటపడాలంటే.. మొక్కలను పెంచడమే మార్గమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో పర్యావరణ పరిరక్షణకై చేపట్టిన ఒక్క కార్యక్రమం లేదని విమర్శించారు. ముఖ్యంగా పార్కుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. తాను మరలా ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో 80 శాతం వరకు పార్కుల పనులు పూర్తి చేసినట్లు వివరించారు. మొక్కలను నాటి వదిలేయడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ట్రీ గార్డులను ఏర్పాటు చేయడం ద్వారా 95 శాతానికి పైగా మొక్కలను కాపాడుకోవచ్చన్నారు. కనుక ప్రతిఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను దత్తత తీసుకోవాలని.. రహదారులు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ.. పచ్చదనం పరిఢవిల్లితేనే మానవాళి మనగడ సాధ్యమవుతుందన్న విషయాన్ని బాధ్యతగల పౌరులందరూ గ్రహించాలన్నారు. కనుక ప్రతిఒక్కరూ పచ్చదనం పెంపునకు ప్రతిన బూనాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అనంతరం స్థానికులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై సౌజన్య, నాయకులు హఫీజుల్లా, హనీఫ్, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నందెపు సురేష్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *