Breaking News

Latest News

తక్షశిల ఐఎఎస్ అకాడమీ మార్గనిర్దేశకత్వంలో ఎనిమిది మందికి సివిల్ సర్వీసెస్ ర్యాంకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తక్షశిల ఐఎఎస్ అకాడమీ మార్గదర్శకత్వం వహించిన 8 మంది విద్యార్థులు అఖిల భారత స్ధాయిలో సివిల్ సర్వీసెస్ ర్యాంక్‌లు సాధించారని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎన్ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.మౌర్య భరద్వాజ్ (28-విశాఖపట్నం), స్నేహ (136-నిజామాబాద్), ఎస్ చిత్తరంజన్ (155-హైదరాబాద్) , ఎస్.ప్రత్యూష్ (183-హైదరాబాద్), S.శ్రీనివాస్ (310-కాకినాడ), డిఎస్ వి అశోక్ (350-కాకినాడ), పవిత్ర (608-హైదరాబాద్), బి.అరవింద్ (623-విశాఖపట్నం) తదితరులు జాతీయ స్ధాయిలో విజేతలుగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మార్గనిర్దేశం వహించిన అకాడమీ …

Read More »

మైదుకూరు నుండి కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణం, నిర్వహణ ప్రక్రియపై అభ్యంతరాల స్వీకరణ

-సలహాలు, అభ్యంతరాల నమోదుకు జూన్ 8 వరకు గడువు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ నీటి అవసరాల కోసం మైదుకూరు RTPP సప్లై లైన్ నుండి చేపట్టనున్న 800 ఎం.ఎం. డయా DI-K9 పైప్ లైన్ డిజైన్, సప్లై, నిర్మాణ పనుల ప్రక్రియపై ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC) ఇంజనీర్ ఇన్ చీఫ్ సీ.హెచ్.ఎస్. శ్రీనివాస ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

మహిళాభివృద్ది, శిశు సంక్షేమంలో భాగస్వామ్య సంస్ధల సహకారం అత్యావశ్యకం

-రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల అభివృద్ది, శిశు సంక్షేమానికి సంబంధించి భాగస్వామ్యం వహిస్తున్న విభిన్న సంస్దలు క్షేత్రస్ధాయిలో మరింత మెరుగైన పనితీరును కనబరచాలని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి తెలిపారు. గుంటూరు సంచాలకుల కార్యాలయంలో యునిసెఫ్, కేర్ ఇండియా, ప్రధమ్, టాటా ట్రస్ట్, వరల్డ్ విజన్, ఐటిసి, అమెరికన్ ఇండియా పౌండేషన్, కేర్ ఎన్ గ్రో సంస్దల ప్రతినిధులతో బుధవారం ఉన్నత స్దాయి సమావేశం …

Read More »

షాబుఖారి దర్గాకు కాంక్రీట్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తాం

-ముస్లింల సంక్షేమానికి బిజెపి కట్టుబడి ఉంది -బిజెపి మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షులు జమాల్ సిద్ధిఖి కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : భూ కబ్జాదారులు చేతిలో చిక్కుకున్న వక్ఫ్ భూముల సమస్యల గురించి చెప్పుకునేందుకు కనీసం వక్ఫ్ ట్రిబ్యునల్ లేకపోవడం రాష్ట్రంలో పాలకులు ముస్లింల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం అని అన్నారు బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షులు జమాల్ సిద్ధిఖీ. బుధవారం నాడు రాష్ట్ర పర్యటనలో భాగంగా కొండపల్లి లోని సుప్రసిద్ధ ఆయన పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గాను …

Read More »

సమగ్ర భూ సర్వే, ఒటిఎస్‌, జగనన్న కాలనీ భూ సమస్యల పరిష్కారం పై ఆలసత్వం తగదు…

-గడువులోగా సమస్యలు పరిష్కరించకుంటే చర్యలు తప్పవు.. -జిల్లా ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సమగ్ర భూ సర్వే ఒన్‌టైమ్‌సెటిల్‌మెంట్‌ (ఒటిఎస్‌) జగనన్న కాలనీలకు సంబంధించి కోర్టులో పెండిరగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో జాప్యాన్ని సహించబోనని గడువులోగా సమస్యలను పరిష్కరించకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు సంబంధిత తహాశీల్థార్లను హెచ్చరించారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకంలో సమగ్ర భూముల రీసర్వే, జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం (ఒటిఎస్‌), జగనన్న కాలనీ లేఅవుట్లకు సంబంధించిన కోర్టు …

Read More »

జిల్లాలో ఉపాధిహామి, జగనన్న కాలనీ గృహా నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధిహామి, జగనన్న కాలనీ గృహా నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, స్పందన ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. ఉపాధిహామి, జగనన్న కాలనీ గృహా నిర్మాణ పనులు, స్పందన ఆర్జీల పరిష్కారం, జగనన్న భూహక్కు భూరక్ష పథకం తదితర అంశాలపై ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

టాటాట్రస్ట్‌ వాసవ్య మహిళామండలి సంయుక్తంగా కిడ్నీ వ్యాధిపై అద్యయనం…

-ఏ కొండూరు సమీప తండాల ప్రజలతో కలిసి జీవించనున్న బృందం… -పూర్తి స్థాయిలో విశ్లేషించి వ్యాధిని నివారించేందుకు ప్రణాళిక… -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టాటాట్రస్ట్‌ వాసవ్య మహిళామండలి సంయుక్తంగా జిల్లాలోని ఏ కొండూరు, రెడ్డిగూడెం, తిరువూరు మండలాలకు చెందిన గ్రామాల్లో కిడ్నీ వ్యాధికిగల కారణాలపై అద్యయనం చేసి వ్యాది నివారణ చర్యల నివేదికను అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. ఏ కొండూరు సమీపంలో కిడ్నీ వ్యాది ప్రభలడానికి గల కారణాలపై అద్యయనం చేసేందుకు …

Read More »

లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ…

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటి నిర్మాణాలు ప్రగతి చూపాలని, బేస్మెంట్ స్థాయి క్రింద ఉన్న వాటిని ప్రగతిగా పరిగణించడం జరగదని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. బుదవారం సాయంత్రం రాజానగరం మండలం నందరాడ లో లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్లు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల సాకారం కోసం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా …

Read More »

మంత్రి అంబటి రాంబాబు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విచ్చేశారు. ఖరీఫ్ సీజన్లో సాగు కోసం తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా కి నీరు విడుదల కోసం నగరంలో బస చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ను బుధవారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవిలత అందించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం …

Read More »

ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి…

-మంత్రులు.. అంబటి రాంబాబు -శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇరిగేషన్ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో ఆయకట్టు చివరి ప్రాంతాల వరకు కాలువల ద్వారా సాగునీటి సరఫరా సక్రమంగా అందేలా చూడాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులకు సూచించారు. బుధవారం దవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కాలువల ద్వారా …

Read More »