ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి…

-మంత్రులు.. అంబటి రాంబాబు
-శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇరిగేషన్ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో ఆయకట్టు చివరి ప్రాంతాల వరకు కాలువల ద్వారా సాగునీటి సరఫరా సక్రమంగా అందేలా చూడాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులకు సూచించారు. బుధవారం దవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కాలువల ద్వారా ఆయకట్టు శివారు ప్రాంతాలకు సమక్రమంగా సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబందించి కాలువల్లో తూడు తొలగింపు వంటి పనులను కాలువల శివారు ప్రాంత భూములకు నీరు చేరే లోగా వేగంగా పూర్తి చేయాలన్నారు.

జిల్లా ఇన్ఛార్జి మరియు బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సీనిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ సీజన్ లో ముందుగానే నాట్లు వేసేందుకు జూన్ 1వ తేదీనే కాలువలకు సాగునీటిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజల, రైతుల అభివృద్దిని కాంక్షిస్తూ 150 సంవత్సాలు క్రితమే బ్యారేజ్ నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ ఈ ప్రాంత రైతాంగానికి ఆరాద్య దైవం అన్నారు. ఇటీవల కాలంలో సర్ ఆర్థర్ కాటన్ మనవుడు ఈప్రాంతానికి విచ్చేసిన సందర్భంలో వారి తాత గారైన సర్ ఆర్థర్ కాటన్ చరిత్ర పుస్తకాన్ని వారికి అందించామని ఆ సందర్భాన్ని పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జలవనరులు శాఖ ద్వారా చేపట్టవలసిన పలు అంశాలపై చర్చించి, పలు సూచనలు చేశారు. కాలువలు, డ్రైయిన్స్ ఆక్రమణలకు గురికాకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలన్నారు. ఆక్రమణలు తొలగింపు ద్వారా మాత్రమే శివారు ప్రాంతాల్లో కి సాగునీరు అందించే సామర్థ్యం పెంచుకో గలుగు తామని పేర్కొన్నారు. రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, సిఎంసి సి.నారాయణ రెడ్డి, సిఈ పుల్లారావు ఎస్ ఈ రాంబాబు (ధవళేశ్వరం) ఎస్ ఈ శివరామకృష్ణ (ఏలూరు) ఇరిగేషన్ శాఖ పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *