Breaking News

Latest News

స్వచ్ఛ కొవ్వూరు ద్వారా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతాం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం లో జాతిపిత మహా త్మా గాంధీ 152 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘ నంగా నివాళులర్పించారు. అనంతరం నందమూరు పాత్రి కేయునిగా పని చేసిన సత్య ప్రసాద్ స్వగ్రామం నందమూరు నందు కుమారుడు మోహన్ మృతికీ మంత్రి సంతాపం వ్యక్త పరిచారు. శనివారం స్థానిక కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయంలో చైర్ పర్సన్ బావన రత్న కుమారి జాతిపిత …

Read More »

డిజిటల్ తరగతుల నిర్మాణంలో, గ్రామాభివృద్ధి లోను దాతలు స్ఫూర్తి గా నిలుస్తున్నారు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల కు మెరుగైన విద్యా ను అందించే దిశలో డిజిటల్ తరగతుల నిర్మాణంలో, గ్రామాభివృద్ధి లోను దాతలు స్ఫూర్తి గా నిలుస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. స్థానిక పసివేదల లోని జెడ్పి హైస్కూల్ ఆవరణ రూ.5 లక్షల తో అవంతి ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన డిజిటల్ తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం వేములూరు లో పంచాయతీ కి ట్రాక్టర్ ను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి …

Read More »

అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, మహాత్మా గాంధీ…

కొవ్వూరు ,  నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం చైర్ పర్సన్ బావన రత్న కుమారి జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, ఆయన జన్మదినాన్ని స్ఫూర్తి గా తీసుకుని స్వచ్ఛ కొవ్వూరు ద్వారా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కేటి సుధాకర్, కౌన్సిలర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డీవో …

Read More »

భరతమాత తల రాతను మార్చిన విధాత…

-సత్యం, అహింస, సిద్ధాంతాలను ఆచరించి నాడే గాంధీజీకి నిజమైన నివాళి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలకు జనసేన పార్టీ నాయకులు భక్తుల వెంకటేష్ ,ఆలమూరు సాంబశివ రావు ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ …

Read More »

పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు గాంధీజీ మార్గంలో వినూత్న నిరసన…

-గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు… -మంత్రి శ్రీను కి అవినీతి మీద ఉన్న దృష్టి అభివృద్ధిపై లేదు… -నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద నుండి చిట్టినగర్ వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని మంత్రి మరియు అధికారులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలో నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ …

Read More »

శ్రమదానం చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం దుర్మార్గం… : పోతిన వెంకట మహేష్ 

-పవన్ కళ్యాణ్ పర్యటన అంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది… -ముఖ్యమంత్రి వస్తే రోడ్లు వేసేవారు నేడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తే రోడ్లు వేస్తున్నారు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన అంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది, వెన్నులో వణుకు మొదలైంది, చెమటలు పట్టడం మొదలైందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఈ రోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అన్నారు. …

Read More »

ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ 152వ జయంత్యోత్సవం…   

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మారుతీనగర్ ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.సి.లంతా ఏకమై శాంతియుతంగా బిసిల జనగణ కోసం ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ తరుపున శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రాష్ట్ర కమిటీలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం …

Read More »

ముఖ్యమంత్రిపై విమర్శలకు యనమల సిగ్గుపడాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-యనమల నోటిని ఫినాయిల్‌తో శుభ్రం చేసుకో… -చంద్రబాబుని మించుతున్న యనమల ఓవరాక్షన్… -బీజేపీ విమర్శలకు వంత పాడటం టీడీపీకి షరామామూలైంది… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై యనమల రామకృష్ణుడు వ్యక్తిగతంగా చేసిన విమర్శలపై సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  తీవ్రంగా స్పందించారు. ఆర్థిక నిర్వహణలో వరస్ట్ ఫైనాన్స్ మినిష్టర్ గా అపకీర్తి మూటకట్టుకున్న యనమల సీఎం జగన్మోహన్ రెడ్డి పై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఆయన అర్థంపర్థంలేని వ్యాఖ్యలు వింటూంటే.. చిన్న మెదడు …

Read More »

జైకిసాన్ స్ఫూర్తితో రైతును రాజును చేసిన ఘనత జగనన్న ప్రభుత్వానిది… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మ‌హాత్ముని ఆశ‌యాల‌కు అనుగుణంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మ‌హాత్మాగాంధీ ఆశ‌యాల‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  పాల‌న సాగుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంత్యోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. కస్తూరిభాయిపేటలో జరిగిన వేడుకలలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి  శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్ముల విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. …

Read More »

మహాత్ముని పలుకులే స్ఫూర్తిగా “జగనన్న స్వచ్ఛ సంకల్పం-క్లీన్ ఆంధ్రప్రదేశ్”: ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పైపులరోడ్డు సెంటర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. శాంతియుత పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయులు గాంధీజీ అని కొనియాడారు. సత్యం, అహింస, శాంతి పదాలకు నిజమైన అర్థం బాపూజీ జీవితం అన్నారు. ప్రపంచ మానవాళి …

Read More »