-లోతట్టు ప్రాంతాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటించారు. కుండపోత వర్షానికి మునిగిన ప్రాంతాలను మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ లతో కలిసి సందర్శించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు కండ్రికలో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు అధికారుల ద్వారా సాయం అందించారు. లోతట్టు ప్రాంతాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బోస్ నగర్, ఎల్బీ నగర్, రాజీవ్ …
Read More »Latest News
కొవ్వూరు డివిజన్ పరిధిలో రెండు స్పందన ఫిర్యాదులు…
-డివిజన్ పరిధిలో తుఫాను కారణంగా ముంపునకు గురైయ్యే ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది… -ఇంఛార్జి ఆర్డీవో/ జేసి (ఆసరా) పి.పద్మావతి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో, కలెక్టర్ సూచనలు మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ (ఆసరా), కొవ్వూరు ఇంఛార్జి ఆర్డీవో పి. పద్మావతి తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా పి. పద్మావతి మాట్లాడుతూ, ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో రెండు ఫిర్యాదులు …
Read More »కంసాలిపాలెం గ్రామంలో శాసన సభ్యులతో కలిసి పర్యటించడం జరిగింది…
-ఎర్రకాలువ లో వరదనీటి ఉధృతి ని పరిశీలించాం.. -ఇంఛార్జి ఆర్డీవో/ జేసి (ఆసరా) పి.పద్మావతి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎర్రకాలువ వరద నీటి ఉధృతి వల్ల ఎనిమిది గ్రామాలు ముంపుకు గురి అయ్యాయని, ఆ అనుభవాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితిని స్థానిక శాసన జి. శ్రీనివాస్ నాయుడు తో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని కొవ్వూరు ఇంఛార్జి ఆర్డీవో/ జేసి (ఆసరా) పి.పద్మావతి తెలిపారు. సోమవారం నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో ఎర్రకాలువ వరద నీటి ఉధృతి ని పరిశీలించారు. …
Read More »మౌంట్ ఎల్ బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన మాస్టర్ భువన్ ను అభినందించిన రజత్ భార్గవ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్ బ్రస్ (ఎత్తు 5642 మీటర్లు)శిఖరాన్ని అధిరోహించి వచ్చిన రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు వారి తనయుడు మాస్టర్ గంధం భువన్ జై ను రాష్ట్ర రెవెన్యూ, పర్యాటక మరియు క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అభినందించారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో మాస్టర్ భువన్ తన తండ్రి గంధం చంద్రునితో కలిసి ఆయనను కలిశారు.ఈ సందర్భంగా రజత్ …
Read More »స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించండి. అధికారులకు ఆర్డిఓ. కె. రాజ్యలక్ష్మీ ఆదేశం…
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్ణీత సమయంలోనే తప్పనిసరిగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులను పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. స్పంధన కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, అనర్హత కలిగిన దరఖాస్తు దారుల విషయంలో అనర్హతకు సంబంధించిన అంశాన్ని సవివరంగా తెలియజేస్తూ …
Read More »కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులతో సహకరించాలి…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలసి చిట్టినగర్ సొరంగం కొండ ప్రాంతాల్లో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షం కారణంగా కొండ రాళ్లు జారి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. కొండపై నివశించు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులతో సహకరించాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు కొండ అంచున ఉన్న వారిని అక్కడ నుండి తరలించుట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్వాతి రోడ్, భవానిపురం, ఎస్.టి.పి పార్క్ మరియు రోటరీ …
Read More »వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలి…
-గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి… -వర్షపు నీటి మునిగిన ప్రదేశాలలో విస్తృతoగా పర్యటించిన మేయర్, కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోని బందరు రోడ్, బి.ఆర్.పి రోడ్, కొత్తపేట గణపతిరావు రోడ్, వించి పేట, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్ట్, కబేళా రోడ్, భవానిపురం, హెచ్.బి. కాలనీ, కాంబె రోడ్, బైపాస్ అవుట్ లైన్ రోడ్డు, ఊర్మిళా నగర్, కృష్ణ లంక, ప్రశాంతి కట్ పిసెస్ రోడ్, ఏలూరు రోడ్, మొదలగు ప్రాంతాలలో సోమవారం నగర …
Read More »భారీ వర్షాల కారణంగా డివిజన్ లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి – అధికారులకు ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాల కారణంగా నూజివీడు డివిజన్ లో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. గులాబ్ తుఫాన్ పరిస్థితి పై సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆర్డీవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ప్రజా జీవనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాజ్ వే ల …
Read More »భారీ వర్షాలకు అధికారులను అప్రమత్తం చేసిన ఆర్డిఓ…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని బందర్ ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్ డి ఓ బందర్ డివిజన్లోని అన్ని మండల తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, ఇతర పోలీస్, రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని ఎలాంటి …
Read More »భారత్ బంద్ నకు మద్దతుగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నిరసన ప్రదర్శనలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు సెప్టెంబర్ 27 న రైతులపై పెను భారాన్ని మోపుతున్న వ్యవసాయ చట్టాలను రద్దు కోరుతూ జరుపుతున్న దేశ వ్యాప్త సమ్మె కు మద్దతుగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యములో విజయవాడ రైల్వే స్టేషన్ ముందు బ్రహ్మాండమైన నిరసన ప్రదర్శన నిర్వహించటం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ …
Read More »