Breaking News

Latest News

ప్రతీ ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలి : కలెక్టర్ జె.నివాస్

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-క్రాప్ నమోదు తో ఎన్నో ప్రయోజనాలున్నాయని, ప్రతీ రైతు ఈ-క్రాప్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో శుక్రవారం పొలంబాట పట్టి వ్యవసాయ శాఖ సిబ్బంది చేస్తున్న ఈ-క్రాప్ నమోదును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి ఎన్నో పధకాలు అమలు చేస్తున్నదన్నారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్, సకాలంలో పంటల రుణాలు అందించడం , ఉచిత పంటల …

Read More »

జిల్లాలో వరద పరిస్థితి పై అధికార్లను అపప్రమత్తం చేసాం : కలెక్టర్ జె. నివాస్ 

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని అపప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. తిరువూరు పట్టణంలో బయో గ్యాస్ ప్లాంట్, కంపోస్ట్ యార్డ్ లను మునిసిపల్ అధికారులతో కలిసి శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు వచ్చి చేరుతోందని , శుక్రవారం ఉదయం 50 వేల క్యూసెక్కు ల నీరు ప్రకాశం …

Read More »

26న స్పందన… : క‌మిష‌న‌ర్‌ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ప్రతీ సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం మరియు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమమును పున:ప్రారంభించుట జరుగుతుందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటన ద్వారా తెలియజేసారు. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజలకు మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌లో ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకొనుటకు ది.26.07.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మద్యాహ్నం 1.00 గంట వరకు న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయంలో మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్ మరియు …

Read More »

29, 30, 31 వార్డు సచివాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే  మల్లాది విష్ణు…

-ఈబీసీ నేస్తం పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి… -మహిళ సంరక్షణ కార్యదర్శి సేవలను విస్తరించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సేవలు సులభమైన పద్దతిలో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. మారుతీనగర్ లోని 29, 30, 31 వార్డు సచివాలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు  మాట్లాడుతూ గడపగడపకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించే ఉద్దేశంతో ఏర్పాటైన వార్డు సచివాలయ …

Read More »

క్రమశిక్షణతో చదివి ఉన్నతశిఖరాలను అధిరోహించాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జాం స్టేజ్ -2 ఫైనల్స్ ఫలితాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం మారుతీనగర్లోని శ్రీ చైతన్య స్కూల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా తో కలిసి  సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో …

Read More »

తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి ఆషాఢమాసం సందర్భంగా సారే సమర్పణ వేడుక గులాబీతోటలో వైభవంగా జరిగింది. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా సారెను సమర్పించారు. భక్తులు ఉత్సవ మూర్తికి పట్టుచీర, పసుపు-కుంకుమ, గాజులు, పూజా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు ప్రతిఒక్కరిపై ఉండాలని, వారు చేపట్టే మంచి పనులన్నింటిలో …

Read More »

గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో కొనసాగుతున్న ఆనందయ్య కరోనా మందు పంపిణీ…

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖ జిల్లా సీతంపేట గొల్ల వీధిలో గల శ్రీ కృష్ణ యువజన సేవా సంఘము భవనం వద్ద స్థానిక ప్రజలు 50 వయస్సు పైబడిన వారికి 500 మందికి అభినవ ధన్వంతరి కృష్ణ పట్టణం  బోణిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమ నిర్వహకులైన శ్రీ కృష్ణ యువజన సేవా సంఘము గౌరవ సలహాదారులు బోరా శ్రీనివాసరావు  మాట్లాడుతూ …

Read More »

పన్నులు వసూలు చేయడం మీద ఉన్న దృష్టి ప్రధాన రహదారులను బాగు చేయాలని లేదా… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ బంగారయ్య కొట్టు సెంటర్ వద్ద నుండి చిట్టి నగర్ వరకు, చిట్టినగర్ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు కెటి రోడ్డు ఇరువైపులా రోడ్డుపై పడ్డ గోతులను, రోడ్ల అధ్వాన్న స్థితితో, పాటు ప్రధాన కాలువలను పరిశీలించారు. వాహనదారులు పాదచారులు రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రధాన రహదారి గుండా ప్రయాణం …

Read More »

శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహలక్ష్మీ అమ్మ వార్ల దేవస్థానం లో శ్రీ మహలక్ష్మీ  అమ్మ వారికి శాకాంబరి దేవి అలంకారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహలక్ష్మీ  అమ్మ వార్ల దేవస్థానం లో శ్రీ మహలక్ష్మీ అమ్మ వారికి రెండవ రోజు శుక్రవారం శాకాంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు శుక్రవారం పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కమిటీ వారు అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి  మరుపిళ్ళ హనుమంతరావు, మరియు కోశాధికారి  పిళ్ళా శ్రీనివాసరావు (పిసి) భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కరోనా జాగ్రత్తలు భక్తులకు దర్శనం అందించారు. రేపు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులచే …

Read More »

కృష్ణాజిల్లాలో 98 గ్రామ, 16 వార్డు సచివాలయాలకు ఐఎస్‌ఓ గుర్తింపు…

-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐఎస్‌ఓ సర్టిఫికేట్లను సచివాలయ ఉద్యోగులకు ప్రధానం – ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – ఉద్యోగులకు సర్టిఫికేట్లను అందచేసిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  పేర్ని వెంకట్రామయ్య (నాని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న 98 గ్రామ, 16 వార్డు సచివాలయాలకు ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ 9001 గుర్తింపు లభించింది. ఈ మేరకు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐఎస్‌ఓ గుర్తింపును సాధించిన సచివాలయాల ఉద్యోగులకు సర్టిఫికేట్ల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర …

Read More »