విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు చదువుతోపాటు భవిష్యత్‌లో ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాలలో జగనన్న విద్యాకానుక పథకాన్ని స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలనే ఉత్సాహం తల్లిదండ్రుల్లో ఉండేది కాదని.. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో పెనుమార్పులు …
Read More »Telangana
దేశానికే తలమానికంగా విద్యావ్యవస్థలో సంస్కరణలు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యా శాతాన్ని పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలోని D. V. సుబ్బారెడ్డి పాఠశాల నందు జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో విద్యావిధానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని తెలిపారు. …
Read More »రైతు క్షేమమే… రాష్ట్ర సంక్షేమం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-రైతు భరోసా రథం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన రైతు భరోసా రథాన్ని కుందావారి కండ్రికలోని రైతు భరోసా కేంద్రం వద్ద శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రచార రథం ద్వారా ప్రదర్శించిన వీడియోని రైతన్నలతో కలిసి …
Read More »చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకో… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-జగన్మోహన్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు -నారా వారి నేరచరిత్ర తెలియనిదెవరికి..? -వెన్నుపోటుకు పేటెంట్ రైట్ నీది కాదా..? -మీ హయాంలో వందల మంది వైఎస్సార్ శ్రేణులను కిరాతకంగా హత్య చేసింది మర్చిపోయారా..? -శవాలను పీక్కుతినే రాజకీయాలను ఇకనైనా మానుకో విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే చంద్రబాబుని మించిన క్రిమినల్ మరొకరు ఉండరని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష నేత చేసిన అనుచిత వ్యాఖ్యలపై …
Read More »మొదటి విడతలో 15 వేల స్కూల్స్ అభివృద్ది…
-త్వరలో 40 లక్షల రూపాయలతో మౌలానా ఆజాద్ ఉర్దూ స్కూల్ అభివృద్ది పనులు -దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు -విద్యాతోనే అభివృద్ది : మేయర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చిన్నారుల చదువు కోసం పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి అమ్మ ఒడి ద్వారా ఏడాదికి రూ. 15 వేలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి దే అని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు …
Read More »విజయవాడలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం వేడుక…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ శాఖ ఆద్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే 65వ వ్యవస్థాపక దినోత్సవం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మనికొండ వెంకట చలపతిరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించగా, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ యూనియన్ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎం వి చలపతిరావు యూనియన్ కు చేసిన సేవలను కొనియాడారు. …
Read More »సులభతర వాణిజ్యంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ కున్న అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలి : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సులభతర వాణిజ్యం(Ease of Doing Business)అంశంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన అధ్యక్షతన పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సులభతర వాణిజ్యం, మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్(MRCB) అంశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సులభతర వాణిజ్యం విషయంలో దేశంలో మన రాష్ట్రానికున్న అగ్రస్థానాన్ని అదే స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నం …
Read More »తొలివిడత నాడు–నేడు కింద ఆధునికీకరణ చేపట్టిన ప్రభుత్వ స్కూళ్లను అంకితం చేసిన సీఎం వైయస్.జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం తొలివిడత నాడు–నేడు కింద ఆధునికీకరణ చేపట్టిన ప్రభుత్వ స్కూళ్లను సీఎం వైయస్.జగన్ అంకితం చేసారు. రెండో విడత నాడు–నేడు పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు విద్యాకానుక కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్.జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. పి.గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడున్న చిట్టిపిల్లలు, అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మూడు …
Read More »నెలాఖరుకల్లా ఈ-క్రాపింగ్ లో పంటల నమోదు పూర్తి చేయాలి… : జెసి డా.కె.మాధవీలత
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెలాఖరుకల్లా గ్రామాల్లో ఈ-క్రాప్ కింద వ్యవసాయ పంటల నమోదు ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లా అధికారులతో సమావేశ మైయ్యారు. జేసి (హౌసింగ్) ఎన్.ఎస్.ఎన్.అజయ్ కుమార్ , జేసి (సంక్షేమం) మోహన్ కుమార్ లతో కలసి తమ ఫిర్యాదులతో కలెక్టరేట్ కు తరలివచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రతి వ్యవసాయ సహాయకుడు రైతుల వ్యవసాయ …
Read More »గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించినవారు తమ భూముల డాక్యుమెంట్లు ధృవీకరించుకోవాలి : ఆర్డీవో కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు అందించిన వారు తమ డాక్యుమెంట్లను సంబంధిత రెవెన్యూ అధికారులతో ధృవీకరించుకోవాలని ఆర్ డివో కె. రాజ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించిన అల్లాపురం, బుద్ధవరం, దావాజీగూడెం గ్రామాలకు చెందిన వారిలో ఇంతవరకు 250 మంది మాత్రమే తమ భూములను సంబంధించిన డాక్యుమెంట్లను అధికార్ల వద్ద ధృవీకరించుకున్నారని, మిగిలిన వారు తమ దగ్గరలోని తాహశీల్దారు కార్యాలయంలో కానీ లేదా నూజివీడు సబ్ కలెక్టరు కార్యాలయంలో సంబంధిత అధికార్లకు తమ …
Read More »