అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు – పేదలందరీకి ఇళ్లుసమీక్ష సమావేశం లో గురువారం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మైలవరం నియోజకవర్గం లో నవరత్నాలు – పేదలందరీకి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం లో భాగంగా శాసనసభ్యునిగా తన వంతుగా చేపట్టిన కార్యక్రమాలు, పేదలకు అందిస్తున్న సహాయ సహకారాలు గురించి వివరించారు. మైలవరం తో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న …
Read More »Telangana
జనసేన పార్టీ నగర కమిటీ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు… : పోతిన వెంకట మహేష్
-బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు మహిళలకు నగర కమిటీ లో ప్రాధాన్యత కల్పించినందుకు అధ్యక్షలు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు… -జీవో నెంబర్ 198 కౌన్సిల్లో ఆమోదించడం చారిత్రాత్మక తప్పిదం… -వైయస్సార్ సిపి కి ఓటేసిన విజయవాడ నగర ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా పన్ను వెన్ను పోటు ను వైఎస్ఆర్సిపి అందజేసింది… -విజయవాడకు నిన్న చీకటి రోజు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ వారి కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల …
Read More »దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తాం… : ఎమ్మెల్యే ఆర్కే
దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే ఆర్కే గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ దుగ్గిరాల మార్కెట్ యార్డ్ నుండి రెవిన్యూ వెళుతున్నా సరే నిధుల కొరత ఉందని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. నిధుల కొరత వలన యార్డ్ నందు అవసరమైన అబివృద్ది పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని తక్షణమే పై అధికారుల దృష్టికి, మంత్రి కన్న బాబు దృష్టికి, ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. …
Read More »వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తాం… : ఎమ్మెల్యే ఆర్కే
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే ఆర్కే గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ యార్డ్ నందు సుమారు 8 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని అధికారుల లెక్కల ద్వారా తెలుసుకోవడం జరిగిందని, త్వరలో ఉన్నతాధికారులను కలిసి ఈ నిధులను మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న గ్రామాల రైతులందరికీ ఉపయోగించే విధంగా టార్పాలిన్ పట్టాలను, తైవాన్ స్ప్రేయర్లను అద్దెకు ఇచ్చే విధంగా, వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని …
Read More »196 సచివాలయం పరిధిలో ఫీవర్ సర్వే…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బావాజీ పేట పరిసర ప్రాంత ప్రజలకు 196 సచివాలయం పరిధిలో కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉండాలని కృష్ణ జిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు కోవిడ్ కట్టడిలో భాగంగా పట్టణంలో ప్రతి వారం ఇంటింటికీ సచివాలయ సిబ్బంది, వాలెంటర్లు, ఆశా వర్కులు, హెల్త్ సిబ్బంది పక్కాగా ఫీపర్ సర్వేను గురువారం నమోదు చేపట్టారు. దీనిలో భాగంగా బావాజీ పేట, రామకోటి మైదానం తదితర …
Read More »మున్సిపల్ కమిషనర్ ని కలిసిన అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ని ఆయన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసిన దేవినేని అవినాష్ పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలలో తిరుగుతున్న అవినాష్ ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను గురుంచి కమిషనర్ తో చర్చించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరగా,సానుకూలంగా స్పందించిన ఆయన వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో …
Read More »పేదవారి అభ్యున్నతికి కృషి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క పేదవారికి అన్యాయం జరగకూడదు అని,వారికి సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయి కి ఎదిగేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం స్థానిక 16 వ డివిజిన్లో కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక గారి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ …
Read More »సీఎం సహాయనిధికి నాలుగు కోట్ల రూపాయల విరాళం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాడు నేడు పధకం రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్ ల్యాబ్స్ తరపున నాలుగు కోట్ల రూపాయల విరాళం. మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్ ల్యాబ్స్ మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి కంపెనీ ప్రతినిధులు తెలియచేసారు. విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను బుధవారం ముఖ్యమంత్రి …
Read More »నాట్యకళకు ఆకర్షితులు కానివారు అత్యంత అరుదు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ నాట్యరీతులు దేశ విదేశాలలో విశేష ప్రాచుర్యాన్ని పొంది భారతీయుల గౌరవాన్ని ఇనుమడింప చేశాయని, ముఖభావాలు చూపుతూ నటనమాడే ఈ మహోన్నతమైన కళకు ఆకర్షితులు కానివారు అత్యంత అరుదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) నిర్వచించారు. బుధవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా, బిగ్ స్క్రీన్ ద్వారా పలుకరించి ప్రజలు పడుతున్న …
Read More »మైనారిటీల అభివృద్దికి విశేష కృషి : ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తానని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు. ఇటీవలి వరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన గంధం చంద్రుడు ప్రభుత్వ పరిపాలనాపరమైన బదిలీలలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. బుధవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టి ఆశాఖ ఉన్నతాధికారులతో ప్రాధమికంగా సమావేశం అయ్యారు. శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. …
Read More »