Breaking News

Telangana

రైతు చైతన్యయాత్రను విజయవంతం చెయ్యండి… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19 వ తేదీన సోమవారం ఉదయం 9 గంటలకు ముదినేపల్లి మండలంలో జరిగే రైతు చైతన్య యాత్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులు, మండల నాయకులు, కృషి చేయాలనిశాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కోరారు. ఆదివారం ముదినేపల్లి తాహశీల్థారు శ్రీనివాస్, పార్టీ నాయకులతో కలసి బొమ్మినంపాడు హై స్కూల్ లో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 9 వ తేదీనుండి 23 వ తేదీ వరకు నిర్వహిస్తున్న రైతు …

Read More »

నగరంలో అభివృద్ది పనులపై సమీక్షించిన మంత్రి పేర్ని…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆదివారం ఆర్ అండ్ బి అతిది గృహంలో మున్సిపల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వాటి ప్రగతి సమీక్షించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పెండింగ్ పనుల గురించి ఆరా తీశారు. అమృత్ స్కీం క్రింద ఇంకా చేయవలసిన పనుల గురించి, నగరంలో వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు గురించి అధికారులను అడిగి …

Read More »

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఆర్థిక భరోసాను కల్పించింది…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మహిళలకు ఆర్థిక స్వావలంబనను కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక పురోభివృద్దికి చేయూతనందింస్తుంది. చేయూత పథకం ద్వారా ఆర్థికంగా బలో పేతం చెందిన లబ్దిదారుల మాటల్లోనే విందాం.. చేయూత మాకు కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించిందంటున్నారు పెదపారుపూడి మండలం వానపాముల గ్రామనికి చెందిన మెండె ఆదమ్మ, మెండే ఆదమ్మ పేద కుటుంబానికి చెందిన మహిళ. వీరికి వివాహం అయిన నాటి నుంచి …

Read More »

టిడ్కో అప్లికేషన్లను అమ్ముకున్న టీడీపీ నేతలకు పేదల ఇళ్ల నిర్మాణం గూర్చి మాట్లాడే నైతిక అర్హత లేదు…

-మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాకు విశేష ప్రజాస్పందన చూసి ఓర్వలేకనే రెచ్చగొట్టే ధోరణి -తెలుగుదేశం అవినీతి రికార్డంతా త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాం : సెంట్రల్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉమ్మడి రమాదేవి, అలంపూరు విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, యరగొర్ల తిరుపతమ్మ, ఉద్దంటి సునీత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ కౌన్సిల్ సమావేశ నిర్వహణపై తెలుగుదేశం సభ్యులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ నగరంలో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడిన తెలుగుదేశం నాయకులు.. …

Read More »

ఇంధన సామర్థ్యంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ!

-అత్యాధునిక సాంకేతికతలతో అందుబాటు ధరలో విద్యుత్తు -ఏపీ ఇంధన సామర్థ్య ఉద్యమంలో భాగస్వాములవ్వాలంటూ జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఆహ్వానం -ఇంధన సామర్థ్యంతో పర్యవరాణనికీ మేలు -రాష్ట్ర ఆర్థికాభివృద్ధికీ దోహదం -పర్యావరణ హితం, నీటి నిర్వహణ, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుపై సీఎం ప్రత్యేక దృష్టి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ -శాఖల వారీగా ఇంధన సామర్థ్య పెట్టుబడి అవకాశాలను గుర్తించండి -ఇంధన శాఖను ఆదేశించిన సీఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవీన, అంతర్జాతీయ సాంకేతికతలను సత్వరమే అందిపుచ్చుకోవడం ద్వారా …

Read More »

శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలి…

-నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపిన మల్లాది విష్ణు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. గాంధీనగర్ చిట్టూరి హైస్కూల్ నందు అఖిల భారత శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీమాన్ జ్వాలాపురి శ్రీకాంత్ తో కలిసి మల్లాది విష్ణు  నూతన …

Read More »

లక్ష మొక్కలు నాటే లక్ష్యంతో నగరంలో ప్రతి రోడ్డులో మొక్కలు నాటాలి మంత్రి పేర్ని

-ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు అందించాలని ప్రభుత్వ ధ్యేయం -అక్రమ వాటర్ ట్యాపులు రెగ్యులరైజేషన్ చేపట్టాలి -ఎవరు తప్పు చేయమని చెప్పినా సౌమ్యంగా నో చెప్పండి, సచివాలయ సిబ్బందికి మంత్రి ఉద్బోధ -సొంత ఇల్లు లేని వారందరికి ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకోవాలి -కార్పొరేటరుగా మంచి పేరు సంపాదించాలని సూచన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆదివారం జిల్లా పరిషత్ మీటింగ్ హలులో కార్పోరేటర్లు, మున్సిపల్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ …

Read More »

బదిలీపై వెళుతున్న విక్రాంత్ పాటిల్ ఐ.పి.ఎస్.కి ఘనంగా వీడ్కోలు… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో వెస్ట్ జోన్ డి.సి.పి.గా కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకితభావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి, శాఖాపరమైన పరిపాలనా ప్రక్రియలో భాగంగా బదిలీపై విజయనగరం, ఏ.పి.ఎస్.పి. కమాండెంట్ గా వెళుతున్న విక్రాంత్ పాటిల్, ఐ.పి.ఎస్.,  ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యా లయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్  బి.శ్రీనివాసులు, ఐ.పి.ఎస్.,  పోలీసు అధికారులు  విక్రాంత్ పాటిల్ ని …

Read More »

ఆషాడ శోభతో శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ క్షేత్రం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ క్షేత్రం ఆషాడ శోభతో ప్రకాశిస్తుంది. అషాడ ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో క్షేత్రానికి భక్తులు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముందుగా అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం కావడంతో అమ్మవారి మూలవిరాట్టుకు పంచామృత అభిషేకాలు ఏకాంతంగా అర్చకులు నిర్వహించారు అనంతరం కొండ దిగువన పంచలోహ విగ్రహాల వద్ద ఆషాడమాస పూజల్లో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమాలు నయన మనోహరంగా నిర్వహించారు. ఈ …

Read More »

స్థానిక సంస్థల్లో 18 వేల పదవులకు బీసీలను దూరం చేసింది వైసీపీ ప్రభుత్వమే : పోతిన వెంకట మహేశ్

-ఇప్పుడు 50 పదవులు ఇచ్చి బీసీలకు పీట వేశాం అనడం దుర్మార్గం -వైసీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం -పేద విద్యార్థులను విదేశీ విద్యకు దూరం చేశారు – పేద యువతులకు పెళ్లి కానుక ఇవ్వకుండా బాధపెడుతున్నారు -జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేశ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి సుమారు 18వేల మంది పదవులకు బలహీన వర్గాలను దూరం …

Read More »