మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మంగళవారం స్థానిక లేడీ యాoప్తిల్ జూనియర్ కళాశాల సందర్శించి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక లేడీ యామ్థిల్ కళాశాలలో పరీక్షల నిర్వహణ పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 21532 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ పరీక్షల …
Read More »Telangana
మోసాలను నివారించేందుకు సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు కృషి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యత ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పించి నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు నాణ్యత లేని వస్తువులు కొనుగోలు చేయడంవలన ఎదురయ్యే మోసాలను నివారించేందుకు సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు కృషి చేయాలని డిపిఆర్సి ప్రిన్సిపాల్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జ్యోతిబసు తెలిపారు. నగరంలోని బందర్ రోడ్డులో గల డిస్ట్రిక్ట్ పంచాయితీ రిసోర్సు సెంటర్ (డిపిఆర్సి) మీటింగ్ హాల్లో సోమవారం నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంశంపై జిల్లాకు చెందిన …
Read More »6వ తేదీన జాతీయ మానవ హక్కుల కమిషన్ పర్యటన
– ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మానవ హక్కుల కమిషన్ క్యాంపు సిట్టింగ్ కు ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఈనెల 6వ తేదీ బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ శ్రీ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బృందం నిర్వహించే క్యాంపు సిట్టింగ్ కు నగరంలోని లబ్బీపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో చేపడుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులతో …
Read More »ఆధార్ సేవలలో దోష రహితంగా ఉండాలి….
-స్పష్టమైన సమాచారంతో ఆధార్ కార్డులు.. -జి.ఎస్.డబ్ల్యు.ఎస్. అధికారి కొడాలి అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు వివిధ రకాల సేవలను సరళతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆధార్ మంజూరుకు స్పష్టమైన దోష రహిత సమాచారం పొందుపరచడంలో ప్రతి ఉద్యోగి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని గ్రామ, వార్డు సచివాలయ విభాగ కార్యదర్శి కొడాలి అనురాధ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలలో అందిస్తున్న ఆధార్ సేవలు మరింత నాణ్యతగా …
Read More »సార్వత్రిక ఎన్నికలకు జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీల నోడల్ అధికారుల నియామకం, జిల్లా కంట్రోల్ రూమ్, ఫిర్యాదుల నివేదిక తదితర అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »పటిష్ట సమన్వయానికి కమాండ్, కంట్రోల్ కేంద్రం ఏర్పాటు
– ఫిర్యాదుల పరిష్కారంతో పాటు నివేదికల నిర్వహణ కూడా కీలకం – పూర్తి అవగాహనతో బృంద స్ఫూర్తితో ఎన్నికల విజయవంతానికి కృషిచేయాలి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇందులో భాగంగా పటిష్ట సమన్వయానికి జిల్లాస్థాయి సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని (ఐసీసీసీ) ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. సోమవారం కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్‌తో కలిసి కలెక్టరేట్ …
Read More »అర్జీలకు నాణ్యతతో పరిష్కారం చూపాలి.
-జిల్లాస్థాయి స్పందనలో 108 ఆర్జీలు నమోదు. -జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, డీఆర్వో వి. శ్రీనివాసరావులు ఆర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ …
Read More »ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి .. జిల్లా రెవెన్యూ అధికారి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 18వ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి 27 వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుండి …
Read More »కేంద్ర ప్రభుత్వం పీఎం సౌర విద్యుత్ పథకం ప్రారంభించింది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దిగువ, మధ్యతరగతి నివాస వినియోగదారుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం సౌర విద్యుత్ పథకం ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఏపీ సి పి డి సి ఎల్ సౌర విద్యుత్ పథకంపై రూపొందించిన గోడపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగువ, మధ్య తరగతి నివాస వినియోగదారులు వారి గృహాలకు తగిన రూఫ్ టాప్ సోలార్ …
Read More »కమిటీ చైర్మన్ ,సభ్యులు సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు మేలు కలిగేలా జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ ల నిర్వహణ పనులు సాగునీటి విడుదలకు ముందుగానే చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం కమిటీ చైర్మన్ జన్ను రాఘవరావు అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో స్పందన మీటింగ్ హాల్లో జరిగింది. జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యలు కమిటీ చైర్మన్ ,సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యంగా జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రేయిన్ల నిర్వహణ పూడిక తీత పనులు సాగునీటి …
Read More »
Prajavartha Online Telugu News