-జిల్లా రెవిన్యూ అధికారి కె. చంద్రశేఖర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, సాధారణ ఎన్నికల్లో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా రెవిన్యూ అధికారి కె. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో కృష్ణాజిల్లాకు సంబంధించి సెక్టోరల్ అధికారులకు ఎన్నికల ప్రవర్తనా నియామవళిపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి డి ఆర్ ఓ కె. చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి మొదటి సారిగా …
Read More »Telangana
రాష్ట్ర ప్రభుత్వం 101.44 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని మంజూరు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన దెబ్బతిన్న 93,665 మంది రైతులను ఆదుకునేందు కోసం రాష్ట్ర ప్రభుత్వం 101.44 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయం నుండి 2023 లో వర్షాభావం, డిసెంబర్ 2023లో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో సంభవించిన అధిక వర్షాల వలన నష్టపోయిన వ్యవసాయ ఉద్యానవన రైతులు 11.60 లక్షల మందికి …
Read More »పన్ను చెల్లింపుదారులకు స్నేహ పూర్వక సేవలు
-ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ సునిత బిళ్ళా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు స్నేహ పూర్వక సేవలందించడానికి నిరంతరం కృషి చేస్తోందని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ సునిత బిళ్లా, ఐఆర్‌ఎస్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతి లావాదేవీని నిఘా నేత్రంతో నిశితంగా గమనిస్తుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విజయవాడ చాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు …
Read More »జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా అడుగులు
-మహిళల ఆర్ధిక అభివృద్ది సామర్ధ్య పెంపులో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు -భూపాలపట్నం బి ఎమ్ యూ సీ పరిథిలో 5 వేల లీటర్ల పాల శీతలీకరణ చేయడం జరుగుతుంది -ఎమ్మెల్యే జక్కంపూడి , జేసి తేజ్ భరత్ లతో కలిసి బి ఎమ్ యూ సీ ప్రారంభం -కలక్టర్ డా కె. మాథవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకి వ్యవసాయం తో పాటు పాడి ఉంటే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందనీ, ఆ క్రమంలోనే అమూల్ కేంద్రాల ద్వారా …
Read More »బాధిత కుటుంబానికి లక్ష రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ అందజేసిన హోం మంత్రి తానేటి వనిత
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం మండలం గోపాలపురం గ్రామం కెనరా బ్యాంక్ వెనుక వీధికి చెందిన మహ్మద్ సుమియకి సీఎంఆర్ఎఫ్ క్రింద లక్ష రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ ను రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అందజేశారు. బుధవారం గోపాలపురం వైసీపీ కార్యాలయం వద్ద లెటర్ ఆఫ్ క్రెడిట్ ను అందించారు. బాధితురాలు మహ్మద్ సుమియ వివిధ అవయవాల పనితీరు కోల్పోవడం వల్ల గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆమె దీనస్థితిని స్థానిక నాయకుల …
Read More »మానవ హక్కుల పరిరక్షణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కృషి
– ఫలప్రదంగా విజయవాడ క్యాంప్ సిట్టింగ్ – రూ. 80 లక్షల మేర పరిహారానికి సిఫార్సులు – సకాలంలో నివేదికల సమర్పణతో బాధితులకు సత్వర న్యాయం – స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు చేస్తున్న కృషి ప్రశంసనీయం – జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కషిచేస్తోందని.. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన కేసులకు సంబంధించి విజయవాడలో నిర్వహించిన …
Read More »సాధారణ ఎన్నికల సమగ్ర సమాచారం చేరవేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయండి.
– అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి – సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబందించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసార మాద్యమాల ద్వారా ప్రజలకు తెలియజేసీ విజయవంతంగా నిర్వహించడంలో ఎన్నికల అధికారుల సూచనలు మేరకు సమన్వయం పని చేయాలని సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి సమాచార శాఖ సిబ్బందికి సూచించారు. సాధారణ ఎన్నికల సందర్భంగా మీడియా సెంటర్,మీడియా సర్టిఫికేట్ మోనిటరింగ్ …
Read More »భవిత కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం పాలెం- వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌లో భవిత కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్.జగన్ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఉపాధి పొందుతున్న యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన భవిత కార్యక్రమం. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైఎస్.జగన్ ఏమన్నారంటే…: ఈ రోజు ఇంతమంది చెల్లెమ్మలు, తమ్ముళ్ల మధ్య భవిత అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. నిజంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పరిశ్రమలను మన …
Read More »‘ప్రైమ్ మినిస్టర్స్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్’ అవార్డుకు ఏపీ పాఠశాల విద్యాశాఖకు చోటు
-IFP, ట్యాబ్‌ల వినియోగంలో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ సబ్జెక్టులైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ పై తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఫ్యూచర్ స్కిల్ ఎక్సపర్ట్ పాత్ర’ ప్రాజెక్టు ఎంపిక – పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యారంగంలో గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విద్య పై దృష్టి పెట్టి అనేక విద్యా సంస్కరణలు చేపట్టిన విషయం విధితమే . ఈ సంస్కరణల్లో భాగంగా గత రెండేళ్లుగా 9,53,000 మంది …
Read More »ఏపీ విద్యా సంస్కరణల అమలు తీరు బాగుంది
-ఉత్తరాఖండ్ ఎస్సీఈఆర్టీ బృందం ప్రశంస విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలు వినూత్నంగా అమలు జరుగుతున్నాయని ఉత్తరాఖండ్ ఎస్సీఈఆర్టీ జాయింట్ డైరెక్టర్ ఆశా రాణి పేర్కొన్నారు. ఆమె ఈరోజు విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వివిధ అంశాలలో ఉత్తరాఖండ్ కి ఆంధ్ర ప్రదేశ్ కి సారూప్యత ఉందని తెలిపారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అమ్మఒడి, నాడు నేడు, టోఫెల్, ఐబీ వంటి కార్యక్రమాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతున్నాయని ప్రశంసించారు. ఎస్సీఈఆర్టీలో ఏర్పాటు చేసిన స్టేట్ అసెస్మెంట్ …
Read More »
Prajavartha Online Telugu News