Breaking News

Telangana

ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ని కలిసిన ఐబీ ప్రతినిధులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్నేషనల్ బాకలరియేట్ బోర్డు ప్రతినిధులు మంగళవారం పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ని సెక్రటేరియేట్ లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఐబీ బృందాల పర్యటన సారాంశం, భవిష్యత్తు ప్రణాళిక, అమలు విధానం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి, ఐబీ ప్రతినిధులు Jenn, Ellen, James, ఎస్సీఈఆర్టీ ప్రతినిధి సుధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read More »

కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కేష్ లత్కర్ కి వినతి పత్రం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్- టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదులుమూడి మధుబాబు మరియు యూనియన్ కమిటీ సభ్యులు కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ కేష్ లత్కర్ ని వడ్డేశ్వరం లోని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన …

Read More »

ఇచ్చిన మాట ప్రకారం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెన్షన్ పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో ని వివిధ డివిజన్ లలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు అయన దృష్టికి వచ్చిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెన్షన్లు నిలిచిపోయాయి అని దాదాపు 35 మందిక వారికి నాడు ఇచ్చిన మాట ప్రకారం గత 6 నెలలుగా 3000 రూపాయల నగదును దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ సభ్యులు అందజేశారు . మంగళవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో …

Read More »

గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ గారి కుటుంబ సభ్యులు సిద్ధార్థ్ గారు తూర్పు నియోజకవర్గ క్రీస్తురాజు పురం కొండ పైన చివరి అంచు ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు. ఈ సందర్భంగా సిద్దార్డ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అందుకున్న సంక్షేమం,జరిగిన అభివృద్ధి చూసి రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ కు …

Read More »

చిరస్మరణీయులు మల్లాది బాల త్రిపుర సుందరమ్మ 

-మాతృమూర్తి ఆరాధనా ఉత్సవాలలో పలువురు వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాతృమూర్తి స్వర్గీయ బాల త్రిపుర సుందరమ్మ ఆరాధనా ఉత్సవాలు మంగళవారం సత్యనారాయణపురంలోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ నందు జరిగాయి. తొలుత శ్రీ జగద్గురు శంకరాచార్య పరంపర అద్వైత పీఠం ఆధ్వర్యంలో జ్ఞాన బోధనలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు నిర్వహించారు. కార్యక్రమంలో బ్రహ్మవేత్తలు, బంధువులు పాల్గొని సుందరమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళుల‌ర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి …

Read More »

డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లలో నిబంధనలు పాటించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల జారీలో రహదారి భద్రతకు ఉన్న మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ ఉల్లంఘిస్తుందని కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారి భద్రతా మండలి సభ్యుడు డాక్టర్‌ కమల్‌ సోయ ఆరోపించారు. మంగళవారం గాంధీనగర్‌లోని ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ రవాణాశాఖ ద్వారా జారీ చేస్తున్న డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు సీఎంవీఆర్‌కు అనుగుణంగా జరగటంలేదన్నారు. డ్రైవింగ్‌ లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌ …

Read More »

పన్నుపై వడ్డీ రాయతీకి 3 వారాలే గడువు…కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 3 వారాలు మాత్రమే ఉంటుందని, నగరంలోని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమీషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, నగర పజలు ఈ …

Read More »

విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ మరియు సెబ్ శాఖలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) శాఖలపై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక శాఖ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) శాఖలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత జిల్లా ఫైర్ అధికారి రమణయ్య వివరిస్తూ విపత్తు స్పందనలో భాగంగా వరదలు, తుఫాన్లు, అగ్ని …

Read More »

7న మెగా జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తి లోని ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల నందు 07-03-2024 తేదీ న జాబ్ మేళా నిర్వహించబడును. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి లోని ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కళాశాల నందు 07-03-2024 తేదీ అనగా గురువారం నాడు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఈ మెగా జాబ్ మేళాకు వివిధ రంగాలకు చెందిన 13 బహుళ జాతీయ కంపెనీలు లలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. విద్యా అర్హతలు: 5th Class/10th …

Read More »

నేడు జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఇంగ్లీష్ పేపర్ -2 పబ్లిక్ పరీక్షలకు 27575 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 27575 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 87 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ పేపర్-2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 27,052 మంది, ఒకేషనల్లో 1,178మంది మొత్తం 28,230 …

Read More »