Breaking News

Daily Archives: July 1, 2024

జూలై 1 నుంచి 31 వరకూ డెంగ్యూ పై అవగాహన కార్యక్రమం

-స్టాప్ డయేరియా జూలై ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్  కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డెంగ్యూ, మలేరియా పై అవగాహన కల్పించడం, డయేరియా నిర్మూలన పై ప్రజల్లోకి విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు తీసుకొని వెళ్లాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డెంగ్యూ, మలేరియా మరియు స్టాప్ డయేరియా గోడ ప్రతులను ఆవిష్కరించి , ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను, మందులను చిన్నారులకు జాయింట్ …

Read More »

మధురపూడి ఎయిర్పోర్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మూడు రోజులు పర్యటన సందర్భంగా సోమవారం మధురపూడి విమానాశ్రయానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి లు మర్యాదపూర్వకంగా కలసి స్వాగతం పలికారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ వద్ద స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసన సభ్యులు బత్తుల బల …

Read More »

3, 4 తేదీల్లో నగరంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా, ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మెయిన్ పంపింగ్ లైన్ల మీద గుర్తించిన లీకులను యుద్ద ప్రాతిపదికన మరమత్తు చేయడం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సంగం జాగర్లమూడి హెడ్ వాటర్ వర్క్స్ నుండి గుంటూరు నగరానికి త్రాగునీరు సరఫరా చేసే 685 ఎం.ఎం. డయా సిఐ పంపింగ్ మెయిన్ లైన్ పై ఫిల్టరేషన్ ప్లాంట్ …

Read More »

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుచేసిన మొత్తాలకు తుది అకౌంట్స్ వివరాలు సమర్పించాలి

-ఈ నెల 4వ తేదీ లోపు తప్పకుండా సమర్పించాలి : జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు – 2024 లో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చుచేసిన మొత్తాలకు తుది అకౌంట్స్ వివరాలను వ్యయ పరిశీలకులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై తిరుపతి …

Read More »

ఫించన్ల‌పై ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం మాట నిల‌బెట్టుకుందిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం ఫించ‌న్ ల‌బ్దిదారుల‌కు నాలుగు వేల రూపాయ‌లు పంపిణి చేసిందని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. గ‌త మూడు నెల‌ల పెండింగ్ తో క‌లిపి ఏడు వేల రూపాయ‌ల‌ను ల‌బ్దిదారుల‌కు అందించి ఎన్డీఏ ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్ష‌పాతి అని నిరూపించుకుంద‌ని ఆయ‌న చెప్పారు. న‌గ‌రంలోని 35వ డివిజ‌న్ లో సోమ‌వారం ఉద‌యం ఆరు గంట‌ల‌కే వికలాంగురాల‌కు నేరుగా ఆమె ఇంటి వ‌ద్దే ఆరు వేల రూపాయ‌ల న‌గ‌దును ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అందించారు. …

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జూబ్లి హరిత ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్‌ డే

–డాక్టర్స్‌కు సన్మానించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించడం అభినందించ దగిన∙విషయమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జూబ్లి హరిత ఆధ్వర్యంలో నగరంలోని వరుణ్‌ హెల్త్‌ సెంటర్‌ ఆవరణలో డాక్టర్స్‌ డే సెలబ్రేషన్స్‌ సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఉన్నతమైనదని చెప్పారు. పేద …

Read More »

సచివాలయ ఉద్యోగులను అభినందించిన ముఖ్యమంత్రికు కృతజ్ఞతలు : ఎం.డి.జాని పాషా

-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి కలలు కన్న రాష్ట్ర అభివృద్ధి సాకారం అవుతుంది -ముఖ్యమంత్రి సచివాలయ ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తారని నమ్మకం ఉంది : ఎం.డి.జాని పాషా. -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీలో అత్యంత బాధ్యతగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించారు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా …

Read More »

ఆరోగ్యవంతమైన సమాజం తోనే దేశాభివృద్ధి సాధ్యం-మంత్రి కొల్లు

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అందువల్ల ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం బందరు మండలం పోతేపల్లి గ్రామంలో మంత్రి జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పోస్టర్లు జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి మంత్రి విడుదల …

Read More »

ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ కే చంద్రశేఖర రావు ఆర్ డి ఓ ఎం. వాణిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం ” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ …

Read More »

మహిళలు బాలికలకు అవసరమైన సేవలందించేందు కోసం సఖి కేంద్రం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : హింసకు గురైన మహిళలు బాలికలకు అవసరమైన సేవలందించేందు కోసం సఖి కేంద్రం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సఖి కేంద్రం గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా మహిళలు గాని బాలికలు గానీ హింసకు గురైతే …

Read More »