3, 4 తేదీల్లో నగరంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా, ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మెయిన్ పంపింగ్ లైన్ల మీద గుర్తించిన లీకులను యుద్ద ప్రాతిపదికన మరమత్తు చేయడం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సంగం జాగర్లమూడి హెడ్ వాటర్ వర్క్స్ నుండి గుంటూరు నగరానికి త్రాగునీరు సరఫరా చేసే 685 ఎం.ఎం. డయా సిఐ పంపింగ్ మెయిన్ లైన్ పై ఫిల్టరేషన్ ప్లాంట్ వద్ద ఏర్పడిన లీకు వలన త్రాగునీరు వృధా అవుతుందని, లీకు మరమత్తు పనులను వెంటనే చేపట్టాల్సి ఉందన్నారు. లీకు మరమత్తు పనుల కోసం సంగం జాగర్లమూడి ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలుపుదల చేయాలని, ఈ నెల 3వ తేదీ (బుధవారం) ఉదయం సరఫరా తదుపరి పనులు చేపట్టడానికి ఇంజినీరింగ్ అధికారులు కార్యాచరణ సిద్దం చేశారని తెలిపారు.
పైప్ లైన్ మరమత్తు పనుల వలన బుధవారం సాయంత్రం, గురువారం ఉదయం వరకు నగరంలోని నాజ్ సెంటర్ రిజర్వాయర్ పరిధిలోని 5,7 డివిజన్లలోని నాజ్ సెంటర్, గుంటూరువారి తోట, పొత్తూరువారి తోట, గణేష్ రావు పేట, కొత్తపేట, రాజాగారితోట, రామిరెడ్డితోట 1 నుండి 8 లైన్లు, గంటలమ్మ చెట్టు, చౌత్రా సెంటర్, పూల మార్కెట్, ఎల్బినగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం, గురువారం ఉదయం త్రాగునీటి సరఫరా నిలిపివేయబడుతుందని, గురువారం సాయంత్రం నుండి త్రాగునీటి సరఫరా యధావిదిగా జరుగుతుందని, నగర ప్రజలు సదరు అంశాన్ని గమనించి తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *