Breaking News

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జూబ్లి హరిత ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్‌ డే


–డాక్టర్స్‌కు సన్మానించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించడం అభినందించ దగిన∙విషయమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జూబ్లి హరిత ఆధ్వర్యంలో నగరంలోని వరుణ్‌ హెల్త్‌ సెంటర్‌ ఆవరణలో డాక్టర్స్‌ డే సెలబ్రేషన్స్‌ సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఉన్నతమైనదని చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందించడానికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలను అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్న వరుణ్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్వాహకులను, అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందిని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అభినందించారు. ఇండియన్‌ అసోసియేసన్‌ ఆఫ్‌ లాయర్స్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ డాక్టర్స్‌డే సందర్బంగా వైద్యసేవలు అందిస్తున్న వారిని సత్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వరుణ్‌ మోటార్స్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీవీ.సత్యనారాయణ మాట్లాడుతూ తమ సంస్థ కేవలం వ్యాపారం చేయడంలోనే కాకుండా సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుంటామని అన్నారు. లయన్స్‌ క్లబ్‌ రీజీయన్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఏ.శరాబందిరావు, జోన్‌ ఛైర్‌పర్సన్‌ తోట పద్మనాభరావు మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. సమాజానికి వైద్యులు అందిస్తున్న సేవలు అమోఘమైనవని అన్నారు. వరుణ్‌ హెల్త్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న బి.విజయ దుర్గ, కె.నరసింహారెడ్డి, షణ్మఖ్‌ తూమాటి, ఎన్‌.గోపికృష్ణ, పి.రంజిత్‌ కుమార్, బి.శివ రామకృష్ణ, ఆర్‌.శ్రీనివాస్, ఆర్‌.సంఘవి, జె.సుచిత్ర, రాజారత్నం, బి.హనుమయ్య, సిర్లిక్‌ ఫిలిప్‌లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు సత్కరించారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జూబ్లి హరిత అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాస ప్రసాద్, కార్యదర్శి కోటా ఫణి, కోశాధికారి జె.శ్రీధర్, సభ్యులు అంకాల సత్యనారాయణ, కాకాని శ్రీనివాసరావు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, రామయ్యతో పాటుగా వరుణ్‌ గ్రూప్‌ సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *