– అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి – సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధత ముఖ్యం – కలెక్టరేట్‌లో 0866-2575833 నంబరుతో కంట్రోల్ రూం – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలుపడే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు; అదేవిధంగా మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు; డివిజన్ స్థాయి అధికారులు.. ఇలా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా …
Read More »Daily Archives: July 20, 2024
పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-వివిధ ప్రాంతాల నుండి వచ్చి తమ బాధతుల చెప్పుకున్న సామాన్యులు -15 సెంట్ల స్థలాన్ని సెంటు పట్టాల జాబితాలో కలిపి పరిహారం కొట్టేశారని ఆచంట మహిళ ఆవేదన -సంతకాల ఫోర్జరీతో రూ.30 లక్షల రుణాలు తెచ్చారన్న చిలకలూరిపేట డ్వాక్రా మహిళలు -విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలు, పార్టీ కార్యకర్తలు నుండి వినతులు స్వీకరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తల నుండి నేరుగా వినతులు తీసుకుని వారి …
Read More »వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష
ఏలూరు,/వేలేరుపాడు, నేటి పత్రిక ప్రజావార్త : పెదవాగు కు ఆకస్మిక వరదల కారణంగా ఏలూరు జిల్లాలో 12 గ్రామాల తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. వేలేరుపాడు మండలంలో శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పెదవాగు ప్రాజెక్ట్ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఉన్నదని, ప్రాజెక్ట్ నిర్వహణ తెలంగాణా ప్రభుత్వం . సాధారణ …
Read More »ఇంజనీరింగ్ తొలిదశ ప్రవేశాలకు 22 చివరి తేది
-రిపోర్టింగ్ పూర్తి చేయకుంటే సీటు రద్దు -సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఈఏపిసెట్ 2024 మొదటి దశ అడ్మిషన్లకు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం లోపు రిపోర్టింగ్ పూర్తి చేయాలని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య తెలిపారు. సీట్ల కేటాయింపు 17వ తేదీన జరిగిందని, సీటు దక్కించుకున్న అభ్యర్థులు పోర్టల్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలను 22వ తేదీ …
Read More »సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన అనా కొణిదెల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనా కి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అనా …
Read More »సీఎం చంద్రబాబు ఆలోచన అద్బుత ప్రయోగం : ఎంపి కేశినేని శివనాథ్
-సీఎం నివాసంలో జరిగిన టిడిపి పార్లమెంటరీ సమావేశం -ఢిల్లీ వేదికగా జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాము విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని వివిధ మంత్రితత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన పలు పథకాలు, నిధుల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఎంపిలు, రాష్ట్ర మంత్రులు కలిసి పనిచేసే విధంగా రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అద్బుత ప్రయోగమని..మంచి సత్ఫలితాలను ఇస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఉండవల్లి లోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో శనివారం …
Read More »శ్రీకాళహస్తి నుండి కనకదుర్గమ్మకు పవిత్ర సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల దేవస్థానం, శ్రీకాళహస్తి నుండి ఇంద్రకీలాద్రి పై నున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల శ్రీధర్ మరియు శ్రీ కాళహస్తి ఆలయ ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ ఆర్ కృష్ణా రెడ్డి మరియు అధికారులు అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా …
Read More »శ్రీ శైలం నుండి కనకదుర్గమ్మకు పవిత్ర సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం, శ్రీశైలం నుండి ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు మరియు ఆలయ అధికారులు కనకదుర్గ అమ్మవారికి ఆషాడ సారె సమర్పించుటకు విచ్చేయగా వీరికి దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యముల నడుమ స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకొని …
Read More »వాతావరణ విశేషాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 1. నిన్నటి వాయుగుండం చిల్కా సరస్సు సమీపంలో ఒడిశా తీరంనకు ప్రయాణించి ఈరోజు అనగా 2024 జూలై 20 న ఉదయము 0 8 .30 గంటలకు గడచిన 3 గంటల్లో అదే ప్రాంతంలో 19.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 85.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద స్థిరంగా ఉంది. ఈ వాయుగుండం పూరీ (ఒడిశా) కు నైరుతి దిశగా 40 కిలోమీటర్లు మరియు గోపాల్పూర్ (ఒడిశా) కు తూర్పు-ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై …
Read More »పిల్లలకు ఇబ్బంది కలిగితే క్షమించేది లేదు
-వ్యాధులు వ్యాపించకుండా మెరుగైన చర్యలు తీసుకోవాలి -భోజనం, తాగునీరు, వసతుల విషయంలో రాజీ పడొద్దు -బీసీ సంక్షేమ హాస్టళ్లలోని సదుపాయాలపై మంత్రి సవిత ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారుల్ని ఉపేక్షించబోనని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. వర్షాలు పడుతుండడం, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో తక్షణమే హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. తాగునీరు, భోజనం, వసతుల విషయంలో రాజీ …
Read More »