Breaking News

Daily Archives: July 27, 2024

రూ.కోటి విలువైన నూతన వైద్య పరికరాలను ప్రారంభించిన మంత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని కంటి విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన రూ.కోటి విలువైన అదునాతన వైద్య పరికరాలను రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ క్రమంలో వైద్య పరికరాల పనితీరు, ఉపయోగాలను సంబంధిత వైద్యాధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల సౌకర్యార్థం మచిలీపట్నం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కంటి సమస్యలకు సంబంధించి వ్యాధుల నిర్ధారణ, చికిత్సల నిమిత్తం కోటి రూపాయల విలువైన …

Read More »

వరద ముంపు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా నిత్యవసర సరుకుల పంపిణీ, ఆర్ధిక సహాయం అందచేత

-జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ -529 కుటుంబాలకు రూ.15 లక్షల 87 వేలు ఆర్ధిక సహాయం -ఒకొక్క కుటుంబానికి రూ.3 వేలు చొప్పున అందచేత -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరీ వరదలు, ఎర్ర కాలువ వరదలలో జిల్లాలో ముంపుకు గురి అయిన 1421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా నిత్యావసర సరుకులను …

Read More »

రాజమండ్రీ రూరల్ లో ముంపు ప్రాంతంలో కలెక్టర్ పర్యటన

-ఆక్రమణలు తొలగింపు, కల్వర్టు నిర్మాణం పై ఆదేశాలు జారీ -ముంపు ప్రాంతాలలో శానిటేషన్ పనులు తక్షణం చేపట్టాలి -కలెక్టర్ ప్రశాంతి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆవా ఛానల్ నుంచి గోదావరీ నది లోకి పంపుతున్న నీరు రాజమండ్రీ రూరల్ పరిథిలో పలు ప్రాంతాలు ముంపుకు గురి కావడం తో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి రూరల్ పరిథిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్ధానికులు నగరం లోని …

Read More »

జాతీయ లోక్ అదాలత్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 14.09.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ గంధం సునీత శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రాజమహేంద్రవరం,అమలాపురం , కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని , ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు …

Read More »

వినియోగదారులకి ఉచిత ఇసుక పంపిణీ చెయ్యడం లో రవాణా ధరల విషయములో హేతుబద్ధత కలిగి ఉండాలి

-ఇసుక రవాణా వాహనాల అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు అమలు చేసే బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ, రవాణా, మైన్స్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక రవాణా కోసం వినియోగించే వాహనాల యజమానులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చార్జీలను వసూలు చేయాలని, ఈ విషయంలో …

Read More »

రాజమండ్రి – ఏలూరు.. రాజమండ్రి – కాకినాడ నూతన బస్సు సర్వీసులు

–రాజమండ్రి – ఏలూరు.. రాజమండ్రి – కాకినాడ నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు రాజమండ్రి – ఏలూరు, రాజమండ్రి – కాకినాడ నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ …

Read More »

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత…

-ప్రతి పాఠశాల లోనూ ఎకో క్లబ్ లు ఏర్పాటు చేయాలి -విద్యార్థులు మొక్కలు నాటి దత్తత తీసుకుని వాటిని సంరక్షించాలి. -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో పర్యావరణ పరి రక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శనివారం స్థానిక ఇన్నీస్ పేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా “పర్యావరణ పరిరక్షణ దినోత్సవం”లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల …

Read More »

రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధికి కృషి చేద్దాం

-రోడ్లు, డ్రైన్స్, త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు మీద ప్రత్యేక కార్యాచరణ -ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు  ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేస్తాం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎక్స్-అఫిషియో మెంబర్ …

Read More »

మోదీ మాయలో చంద్రబాబు… జగన్‌ చేత ధర్నా చేయించింది మోడీనే!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోదీ ప్రభుత్వం అడుగడుగునా మోసగిస్తోందని, అయినా చంద్రబాబు ప్రధాని మోదీ మాయలో పడిపోయారని, జగన్‌ చేత ధర్నా చేయించింది మోడీనే అని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ చింతామోహన్‌ ఆరోపించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని జగన్‌ అడిగారని, ప్రజలు ఇచ్చారు అంతే అన్నారు. జగన్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ …

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌తో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్

మంగ‌ళ‌గిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగ‌ళ‌గిరి ఎపిఐఐసి ట‌వ‌ర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్యాల‌యం నుండి శనివారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య‌శాఖాధికారులు, ఆసుప‌త్రుల సేవ‌ల జిల్లా స‌మ‌న్వ‌యాధికారులు, జిల్లా, ప్రాంతీయ‌, సామాజిక ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌తో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. జూన్ నుండి రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నందున కీట‌క జ‌నిత వ్యాధులు ప్ర‌బ‌ల‌డం, నీరు క‌లుషితం కావ‌డం, ప‌రిశుభ్ర‌త వంటి అంశాల‌పై …

Read More »