విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో అంగరంగ వైభవముగా ప్రారంభమైన శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో బాగంగా చివరి రోజు అవ్వడంతో అమ్మవారి దర్శనం నిమిత్తం ఇరు రాష్ట్రల నుండి అధిక సంఖ్యలో భవాని భక్తులు రావడంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఎక్కడా తొక్కిసలాట జరుగకుండా అమ్మవారి దర్శనం అయ్యేవిధంగా బందోబస్త్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షస్తూ బందోబస్త్ అధికారులకు మరియు సిబ్బందికి అప్పటికప్పుడు సలహాలను సూచనలను అందించడం జరిగింది. …
Read More »Daily Archives: October 12, 2024
అమ్మ వారి కి 10 లక్షల బంగారు హారం బహుకరించిన పంకజ్ రెడ్డి
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త పంకజ్ రెడ్డి, సరిత దంపతులు పది లక్షల రూపాయలు విలువైన బంగారు హారం అమ్మవారికి బహుకరించారు. వస్తు విలువను నిర్ధారించే… ధ్రువీకరణ పత్రం, హారం శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్ రామారావుకు అందజేశారు. అనంతరం దాతలకి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పిఆర్ఓ డి వి వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More »విపత్తు నుంచి విజయవంతమైన వేడుకలు
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల సంభవించిన వరద విపత్తు నుంచి విజయవంతంగా జరిగిన దసరా వేడుకలతో విజయవాడ నగరం ప్రకాశించిందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వరద విపత్తుతో ప్రజలందరి గుండెలు బరువెక్కాయని నేడు శరన్నవరాత్రుల వెలుగులతో విజయవాడ నగరం ప్రకాశించిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ అవిశ్రాంత కృషి, దుర్గమ్మ చల్లని దీవెనలతో నగరవాసులకు స్వాంతన చేకూరిందన్నారు. విజయవాడ నగరం వరదల నుంచి కోలుకొని …
Read More »శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతార విశిష్టత…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ దశమి(విజయ దశమి) రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తుంది. నవరాత్రులలో ఈరోజే ఆఖరిరోజు. ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయంలో అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు. ఈరోజును విజయదశమిగా అమ్మవారు చిద్రూపిణి. వరదేవతగా అలరారుతుంది. పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని, చేతిలో చెరకుగడతో, చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజించుకోవాలి. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి …
Read More »సీఎం చంద్రబాబును కలిసి మెగాస్టార్ చిరంజీవి
-వరద సాయం కింద ఎపి సిఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందజేత హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి…వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై ముఖ్యమంత్రి …
Read More »సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై రివ్యూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా సివిల్ సప్లై శాఖ తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలని సిఎం అధికారులకు సూచించారు. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి …
Read More »దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దసరా పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల దుష్టపాలనను ఏపీ ప్రజలు తరిమి తరిమి కొట్టారని, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ పట్టం కట్టారని అన్నారు. సైకో పాలకులను ప్రజా మద్దతుతో తరిమికొట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధి లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పెట్టుబడుల …
Read More »విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయదశమి పర్వదినం పురస్కరించుకుని తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమటలంక మరియు 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు నిర్వహించిన దసరా ఉత్సవాలలో ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు .ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజలందరికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకొంటూన్నట్టు తెలిపారు. తెలుగు ప్రజాలందరికి విజయదశమి పండుగ …
Read More »శరన్నవరాత్రుల ముగింపు పూర్ణాహుతి కార్యక్రమం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాల సందర్భంగా శనివారం విజయ దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో, భవానీ మాలధారులతో ఇంద్రకీలాద్రి జనసంద్రమైంది. జై భవాని, జై జై భవాని.. జై దుర్గా, జై జై దుర్గా జయజయధ్వానాలతో హోరెత్తింది. ఆధ్యాత్మిక పరిమళాలతో సుగంధ భరితమైంది. శరన్నవరాత్రుల కార్యక్రమాల ముగింపు రోజు శాస్త్రోక్తంగా నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. విజయదశమి కావడంతో సాధారణ భక్తులతో పాటు …
Read More »ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంవద్దు…
-అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తాం… డీటీసీ ఎ మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని కాంటాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలను నిర్వహించామని అధికదరలు వసూలుచేస్తున్న బస్సులపై కేసులు నమోదుచేసామని డీటీసీ ఎ మోహన్ తెలిపారు. స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయం నుండి శనివారంనాడు పత్రిక ప్రకటనను విడుదల చేసారు ఈ సందర్భంగా డీటీసీ మోహన్ మాట్లాడుతూ పండుగలకు దూరపు ప్రాంతాల నుండి సొంత ఊర్లకు వస్తున్న ప్రయాణికుల నుండి ఇదే …
Read More »