-వరద సాయం కింద ఎపి సిఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందజేత
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి…వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. విరాళం చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి సాదర స్వాగతం పలికిన సిఎం చంద్రబాబు నాయుడు…..భేటీ అనంతరం కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు.