Breaking News

Daily Archives: October 30, 2024

రవాణా అధికార్లు యూనిఫామ్ లేకుండా రోడ్డు పై కనబడితే కఠిన చర్యలు తప్పవు మంత్రి వెల్లడి.

-కడప ఆర్టీవో కార్యాలయంలోని బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయ భాస్కర్ రాజు పై తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని మంత్రి హితవు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అధికారై ఉండి అక్రమ వసూళ్లు పాల్పడటం హ్యేయమని, అధికారిని ప్రశ్నించడం పట్ల డ్రైవర్ల ఆవేదన అర్ధమవుతుందని, కడప ఆర్టీవో ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ భాస్కర్ రాజు అక్రమ డ్రైవర్లు వద్ద వసూళ్లకు …

Read More »

అన్న క్యాంటీన్లు, వరద బాధితులకు విరాళాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పేద‌ల క‌డుపు నింపుతున్న అన్న క్యాంటీన్ల‌కు స‌జ్జా రోహిత్ అనే దాత రూ. 1 కోటి విరాళం అందజేశారు. స‌చివాల‌యంలో బుధ‌వారం ఆయ‌న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని క‌లిసి విరాళానికి సంబంధించి చెక్కును అంద‌జేశారు. అలాగే క‌పిలేశ్వ‌ర‌పురం మాతృభూమి శ్రేయోసంఘం ప్ర‌తినిధి కె. రామ్మోహ‌న‌రావు కూడా అన్న క్యాంటీన్ల‌కు రూ.5,41,116 చెక్కును అంద‌జేశారు. ఎస్‌.కె. యూనివ‌ర్సిటీ సిబ్బంది త‌ర‌ఫున ఆచార్య జి.వెంక‌ట నాయుడు రూ.17,34,786, కుప్పం నియోజకవర్గం నుండి సేకరించిన రూ.14,36,000 విరాళాన్ని మాజీ ఎమ్మెల్సీ …

Read More »

వరదల్లో నష్టపోయిన వాహనదారుల బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి

-బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం -బుడమేరు వరద నివారణ కు డీపీఆర్ సిద్ధం చేయండి -అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు పంపిణీ చేసిన పరిహారంపై అధికారులతో సచివాలయంలో బుధవారం …

Read More »

డ్వాక్రా సంఘాలకు మరింత చేయూతనిస్తాం

-వచ్చే ఐదేళ్లల్లో పేదల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రణాళికలు -పేదరిక నిర్మూలనకు నిజమైన లబ్ధిదారుల ఎంపికకు ఎస్ హెచ్ జి ప్రొఫైలింగ్ యాప్ తోడ్పాటు -జనవరి నుంచి అమరావతి రాజధాని పనులు -రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేయాలంటే ప్రజల స్థితిగతులపై పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధించగలమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. …

Read More »

ప్రభుత్వ వైద్య కళాశాలకు డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరు ప్రతిపాదించిన ఉప ముఖ్యమంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త, తెలుగు తేజం దివంగత డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వివరాలు అందించారు. ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సబ్బారావు  స్వస్థలం భీమవరం, చదువుకున్నది రాజమహేంద్రవరం కావున – కొత్తగా ఏర్పడిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏదైనా ఒకదానికి ఆయన పేరుపెడితే సముచితంగా …

Read More »

దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకం

-దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం -మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేసిన సిఎం చంద్రబాబు -నిన్నటి నుంచి అమల్లోకి దీపం -2 పథకం -1వ తేదీన శ్రీకాకుళంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్రం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం …

Read More »

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

-చీకటిపై “వెలుగు”, చెడుపై “మంచి”..విజయానికి ప్రతీక దీపావళి అని పేర్కొన్న మంత్రి -ప్రజలందరి జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగిపోయి సంతోషాల వెలుగులు ప్రసరించాలని దేవున్ని ప్రార్థించిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. టపాసుల వెలుగులతో, దీప కాంతుల జ్యోతులతో, సిరసంపద రాసులతో ఈ దీపావళి ప్రతి ఇంట సిరుల పంట కురిపించాలని కోరుకుంటున్నానన్నారు.. కారు చీకట్లను దీపాల కాంతులు …

Read More »

వెలుగుల పండుగ దీపావ‌ళి – ప్ర‌జ‌ల జీవితాల్లో స‌రికొత్త కాంతులు నింపాలి

-దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఎంపి కేశినేని శివ‌నాథ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. “తెలుగునేలపై నరకాసురుని ఏలుబడిలో ఇక్కట్ల పాలైనసమస్త ప్రజలు చీకటి పాలనకు స్వస్తి వాచకం పలికారు. అంధకారం తొలిగిపోయి..ఎన్డీయే కూటమి అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వెన్నెల వెలుగు తెలుగు లోగిళ్లలో ప్రసరిస్తుంది. రాష్ట్రం అభివృద్ధి దిశలో …

Read More »

ఘనంగా గ్యార్మీ వేడుకలు

-పాల్గొన్న ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కబేళా ప్రాంతంలో బుధవారం గ్యార్మీ షరీఫ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మటన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి గ్యార్మీ జెండాతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు సయ్యద్ సలీం, తాజుద్దీన్, షేక్ బాషి, …

Read More »

తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి… : ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.

Read More »