Breaking News

Monthly Archives: October 2024

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు, అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్10TH ట్రేడ్స్మన్, అగ్నివీర్ 8TH ట్రేడ్స్మన్, 10 నవంబర్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు గుంటూరు (ఆంధ్రప్రదేశ్)లోని DSA స్టేడియంలో కడప రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించబోతోంది. అగ్నివీర్ ట్రేడ్స్మన్ 8వ తరగతి ఉత్తీర్ణత. సబ్జెక్ట్ ర్యాలీకి అడ్మిట్ కార్డులు పొందిన కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, గుంటూరు, ప్రకాశం, …

Read More »

ఉల్లాస్ అక్ష‌రాస్య‌తా కార్య‌క్ర‌మంపై దృష్టిపెట్టండి

-ప‌థ‌కం అమ‌లుకు అధికారులు ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయండి -జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌దిహేనేళ్ల‌కు పైబ‌డిన వారిలో నిర‌క్ష‌రాస్యుల‌ను గుర్తించి.. వారిని అక్ష‌రాస్యులుగా తీర్చిదిద్ద‌డంతో పాటు ఆర్థిక అక్ష‌రాస్య‌త‌, డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త పెంపొందించేందుకు ఉద్దేశించిన ఉల్లాస్ (అండ‌ర్‌స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫ‌ర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్య‌క్ర‌మం అమ‌లుపై అధికారులు ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా ఆదేశించారు. శుక్ర‌వారం సాయంత్రం జాయింట్ క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఉల్లాస్ కార్య‌క్ర‌మం …

Read More »

ప్రత్యేక వైద్య నిపుణులుతో ఉచిత మెగా వైద్యశిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో విజయవాడ పట్టణ పరిధిలోని వాంబేకాలనీలో ఇటీవల వరదల ప్రభావానికి గురై వివిధ అనారోగ్య పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా ఈ నెల 19 వ తేదీ శనివారం ఉదయం 9 గం నుండి 5 గం వరకు స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచిత మెగా ప్రత్యేక వైద్య శిబిరం పట్టణ ఆరోగ్య కేంద్రం, వాంబే కాలనీ GXL – G . block., నందు ఏర్పాటు చేయడం జరిగినది.ఈ శిబిరం నందు గుండె …

Read More »

90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్ధ ప్రత్యేకంగా చేపట్టిన 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని ముమ్మరం చేయాలని, డ్రైవ్ పర్యవేక్షణకు విధులు కేటాయించబడిన అధికారులు మరింత శ్రద్దగా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుకోవదానికే 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టామని, డ్రైవ్ పర్యవేక్షణకు విధులు కేటాయించబడిన 22 మంది సీనియర్ …

Read More »

మురుగు పారుదలకు అడ్డంకిగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణలను దశల వారీగా తొలగింపు…

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల పై ఆక్రమణలను దశల వారీగా తొలగిస్తామని, ప్రజా సౌకర్యార్ధం ఆక్రమణదారులు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ వైద్యశాల, రైల్ పేట ప్రధాన రహదారిలో డ్రైన్ మీద, రోడ్ల మీద ఆక్రమణలను ఏసిపి మల్లికార్జున ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక అక్రమ ఆక్రమణ దళం తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో …

Read More »

జాతీయ సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేశన్ కి సాదర స్వాగతం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల అక్టోబర్ 18 నుండి 20 వరకు తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలలో పాల్గొనుటకు నేటి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం కు విచ్చేసిన జాతీయ సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేశన్ కి జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య మరియు ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి తదితరులు సాదర స్వాగతం పలికారు. జాతీయ సఫాయి కరంచారి కమిషన్, న్యూ ఢిల్లీ చైర్మన్ ఎం.వెంకటేశన్ ఈ నెల …

Read More »

రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు

-పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం కోసం కట్టుబడి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి :జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రిలో మెరుగైన పలు సౌకర్యాల ఏర్పాటుకు కమిటీ ఆమోదిస్తూ పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు బాధ్యతగా అందించాలని వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్వీ వైద్య కళాశాల పాలన భవనం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా …

Read More »

మనబడి-మన భవిష్యత్తు కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి పురోగతి సాధించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మనబడి-మన భవిష్యత్తు కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ అధికారులతో మనబడి మన భవిష్యత్తు పురోగతిపై సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కింద రెండవ దశలో 488 పాఠశాలల్లో 180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు …

Read More »

మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నిర్ణీత సమయానికి మచిలీపట్నం పోర్టు సిద్ధం చేసేందుకు అందుకు సంబంధించిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టు నిర్మాణం రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత …

Read More »

బ్యాంకులు ఇతోదికంగా రుణాలు మంజూరు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక (ఎమ్మెస్ ఎం ఈ) రంగంతో పాటు విద్య, గృహ నిర్మాణ రంగాలకు బ్యాంకులు ఇతోదికంగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో మీకోసం మీటింగ్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరద ప్రభావిత జిల్లాగా గత డిసిసి సమావేశంలో ప్రకటించిన విషయం …

Read More »