Breaking News

ప్రత్యేక వైద్య నిపుణులుతో ఉచిత మెగా వైద్యశిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో విజయవాడ పట్టణ పరిధిలోని వాంబేకాలనీలో ఇటీవల వరదల ప్రభావానికి గురై వివిధ అనారోగ్య పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా ఈ నెల 19 వ తేదీ శనివారం ఉదయం 9 గం నుండి 5 గం వరకు స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచిత మెగా ప్రత్యేక వైద్య శిబిరం పట్టణ ఆరోగ్య కేంద్రం, వాంబే కాలనీ GXL – G . block., నందు ఏర్పాటు చేయడం జరిగినది.ఈ శిబిరం నందు గుండె వ్యాధుల,ప్రసూతి వైద్య , పిల్లలు వైద్య నిపుణులతో పాటు సాధారణ వ్యాధుల నిపుణులు,ఎముకలు వ్యాధి నివారణ నిపుణులు, తదితర ప్రత్యేక వైద్య నిపుణులు సేవలు అందించడం జరుగుతుందని, అదేవిధంగా ఉచిత రక్త పరీక్షలు చేసి వైద్య నిపుణులు సలహా మేరకు ఉచితంగా మందులు అందించబడునని సంబంధిత న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు తెలపడం జరిగినది.ఈ అవకాశంను వాంబే కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *