Breaking News

రాష్ట్ర స్థాయి వాణిజ్య పన్నుల శాఖ సమీక్షా సమావేశం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థాయి వాణిజ్య పన్నుల శాఖ సమీక్షా సమావేశం ఆ శాఖ ముఖ్య అధినేత A. బాబు I.A.S. అధ్యక్షతన ఈ నెల 25,26 న జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మరియు వాణిజ్య పన్నుల శాఖ విచ్చేశారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ I.A.S. హాజరయ్యారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి “రాజ్యాంగ ప్రవేశిక” సామూహిక పఠనం చేయించడం తో సమీక్షా సమావేశం ఆరంభమయింది. సమీక్ష లో భాగంగా ముఖ్యమంత్రి ఆశయాలకు ఆకాంక్ష లకు అనుగుణంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి అభివృద్ధి బాటలోకి తీసుకు రావడం లో భాగంగా లక్ష్యాల ను ఛేదించడానికి శాఖాపరమైన మార్గదర్శకాలను నిర్దేశించారు. రాష్ట్రం లో వస్తు రవాణా రూపం లో జరుగుతున్న లీకేజీ లను అరికట్టడానికి తగిన చర్యలను తీసుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చురుకుగా వ్యవహరించాలని తద్వారా రాష్ట్రం లోని నిజాయితీ గా పన్నులు చెల్లించే వ్యాపారస్తులు నష్టపోకుండా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి వాణిజ్య పన్నుల శాఖ శాయ శక్తులా కృషి చేస్తుందని చీఫ్ కమీషనర్ హామీ ఇచ్చారు. సమావేశానికి రాష్ట్ర స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి జాయింట్ కమిషనర్ లు , డిప్యూటీ కమిషర్ లు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక స్థితి పునరుద్ధరణకు శాఖ లోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ రాబడి లో సింహ భాగాన్ని వాణిజ్య పన్నుల శాఖ నుండే వస్తుందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ శాఖ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వినూత్న విధానాలను అవలంబించి ముందుకు సాగాలని ఉద్యోగులను చైతన్య పరిచారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *