-NDA కూటమి కాపు కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయటం హర్షణీయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అభినంద నీయమని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామమోహనరావు అన్నారు బేతు మాట్లాడుతూ ఎన్నికలప్రచారం లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలు మేరకు కాపు కార్పొరేషన్ సంక్షేమ అభివృద్ధి కి తొలి విడత గా 4647కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేస్తున్నట్లు బీ సీ సంక్షేమ శాఖ మంత్రి వెల్లడించారని సంతోషం అని అన్నారు, కూటమి ప్రభుత్వం మాటలు ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని రుజువు చేసారని, మా కాపు, తెలగ, బలిజ, ఒంటరి మరియు తూర్పు కాపు ఉప కులాల సంక్షేమ అభివృద్ధి కి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి, కాపు మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు కు, యావత్తు కాపు ఉపకులస్థుల తరపున ప్రత్యేక హృదయ పూర్వక అభినందనలు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామని, అలాగే గతంలో బాబు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ 10% లో 5% ఇస్తానని అన్న కాపు ఉప కులాల కు త్వరలో అమలు చేయాలి అని బేతు అన్నారు ఈ సమావేశం లో ఉమ్మడి శెట్టి కృష్ణ మూర్తి, వన్నెంరెడ్డి రాధా కృష్ణ, భూపతి మహేష్కుమార్ , పుప్పాల రవి కుమార్, వెలుగంటి లక్ష్మణ రావు పయ్యావుల రాము, చలమలశెట్టి శ్రీనివాస్ తదితర కాపు నాయకులు పాల్గొన్నారు.