-బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా గొట్టుముక్కల ప్రమాణ స్వీకారం
-హాజరైన ఎంపి కేశినేని శివనాథ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ దుర్మార్గ పాలనలో భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర టి.ఎన్.టి.యు.సి అధ్యక్షుడిగా గొట్టుముక్కల రఘురామరాజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర రంగాలకు చెందిన కార్మికుల సమస్యలపై పోరాడాడు…నిత్యం కార్మికుల, శ్రామికుల సంక్షేమం గురించి ఆలోచించే గొట్టుముక్కల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎన్.ఎ.సి (National Academy of Construction) ని మించిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను అమరావతిలో ఏర్పాటు చేయటంతో పాటు, భవన నిర్మాణ కార్మికుల అభ్యున్నతికి కృషి చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు.
బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా టిడిపి రాష్ట్ర నాయకుడు గొట్టుముక్కల రఘురామరాజు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం బందర్ రోడ్డులోని అమరావతి కన్వెన్షన్ హాల్ లో శనివారం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి టిడిపి నాయకులు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనకు ముందు గా స్వాతంత్య్ర సమరయోధుడు, టిడిపి వ్యవస్థాపకుడు,మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. అనంతరం గొట్టుముక్కల రఘురామరాజు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా ప్రమాణా స్వీకారం చేశారు. ఆ తర్వాత ఎంపి కేశినేని శివనాథ్ గొట్టుముక్కలకి శుభాకాంక్షలు తెలపటంతోపాటు శాలువాతో సత్కరించారు.
ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, ప్రభుత్వ విప్ బొండా ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్,టిడిపి రాష్ట్రఅధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షుడు పర్చూరి ప్రసాద్ లతో పాటు ఇతర టిడిపి నాయకులు గొట్టుముక్కల కి అభినందనలు తెలిపారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి క్షణం కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పార్టీలో అంచెలంచెలుగా గొట్టుముక్కల ఎదిగాడని కొనియాడారు. టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షుడిగా గత ప్రభుత్వ దుర్మార్గ పాలన పై తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాడారని తెలిపారు. నిత్యం కార్మికులకి, శ్రామికులకి అండగా, తోడుగా, వారి అభ్యున్నతికి కృషి చేసేందుకు అవకాశం వున్న బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పదవి గొట్టుముక్కలకి రావటం ఎంతో సంతోషంగా వుందన్నారు. గతంలో వేరే కార్పొరేషన్ చైర్మన్ పదవికి అవకాశం వస్తే…టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షుడిగా వుండటమే ఇష్టమని గొట్టుముక్కల చెప్పినట్లు తెలిపారు.
తన రాజకీయ ప్రవేశం నుంచి వెన్నంటే వుండటమే కాకుండా.. తన గెలుపుతో పాటు ఎన్డీయే కూటమి అభ్యర్దుల గెలుపుకి తీవ్రంగా కృషి చేశాడన్నారు…గత ఐదేళ్లలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షుడిగా టి.ఎన్.టి.యు.సి ని ఎంతో క్రమశిక్షణగా నడిపించటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టి.ఎన్.టి.యు.సి కి గుర్తింపు తీసుకువచ్చాడని తెలిపారు. ఆ విధంగానే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా ఆ సంస్థ ను అభివృద్ది పథంలో నడిపించి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.అందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.