Breaking News

అవగాహన ఒప్పందం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యా సంస్థ ప్రధాన కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు నందు గురువారం Dr B R అంబేడ్క ర్ గురుకులాలలో పని చేస్తున్న ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయులకు ప్రత్యక్ష మరియు పరోక్ష శిక్షణా తరగతుల కొరకు అజిమ్ ప్రేమ్ జి యూనివర్సిటీ, బెంగుళూరు వారితో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ సంధర్బంగా, ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యా సంస్థల కార్యదర్శి , వి ప్రసన్న వెంకటేష్, ఐ ఏ ఎస్  మాట్లాడుతూ Dr B R అంబేడ్క ర్ గురుకులాలలో పని చేస్తున్న PRINCIPALS కు విధ్యా పరమైన నాయకత్వ మరియు వ్యక్తిగత ప్రభావం గురించి ప్రత్యక్ష మరియు పరోక్ష పద్దతిలో తర్ఫీదు ఇవ్వడం జరుగు తుందని తెలియజేసారు . విద్యా పరమైన నాయకత్వం ఉంటే సంస్థా గత నిర్వహణ, అధ్యాపకులను మరియు విద్యార్థులను విజయం వైపు నడిపిస్తారని తెలియజేశారు. ఇంగ్లీష్ , మ్యాథ్స్, సైన్స్ మరియు సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకు ప్రత్యక్ష మరియు పరోక్ష పద్దతిలో 5 రోజుల పాటు బోధనా శాస్రం (Pedagogy) యోగ్యత ఆధారిత విద్యా (competency based education) అభ్యాస ప్రమాణాలు ( Learning standards) పాఠ్య ప్రణాళిక (Lesson plan) నందు తర్ఫీదు మరియు శిక్షణ ఇస్తామని తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యా సంస్థ ప్రధాన కార్యాలయం లో జరిగిన సమావేశానికి ఎన్. సంజీవరావు , జాయింట్ సెక్రటరీ , అకాడమిక్, ఎ మురళి కృష్ణ, జాయింట్ సెక్రటరీ , అకాడమిక్, ఆంచల్ చోమల్, అసోసియేట్ డైరెక్టర్, అజిమ్ ప్రేమ్ జి యూనివర్సిటీ, బెంగుళూరు, జుబిమోల్.జె Asst.Professor , Azim Premssji University, బెంగుళూరు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *